23.3 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

పాక్ వెన్ను విరిచిన భారత్…!!

  • పాకిస్థాన్ ను ఆర్ధికంగా కుప్పకూల్చిన భారత్
  • వాణిజ్య బంధాలకు గుడ్ బై !!
  • వాణిజ్య కార్యాలయం డైరక్టరేట్‌ ప్రత్యేక ప్రకటన
  • ఇన్ బౌండ్ మెయిల్స్, పార్సిల్స్ బట్వాడా నిలిపివేత
  • పాక్ నౌకలకు మన పోర్టులో ఎంట్రీ రద్దు
  • నిన్నటినుంచే ఆంక్షల అమలు
  • ఆన్ రూట్ లో ఉన్న వాటిని వెనుకకు మళ్లింపు
  • ఇప్పటికే ఎయిర్ స్పేస్ మూసేసిన ఇరు దేశాలు
  • దుబాయ్ తో కొనసాగిస్తున్న వర్తక,వాణిజ్యాలు
  • వాణిజ్య ఒప్పందం రద్దుతో పాక్ పని అవుట్
  • పుల్వామా దాడి తర్వాతే దెబ్బతిన్న సంబంధాలు
  • అప్పటినుంచి పరిమిత వాణిజ్య ఒప్పందాల అమలు
  • తాజాగా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఉపసంహరణ

పెహల్గాం దాడికి నిరసనగా పాకిస్థాన్ పై భారత్ ఆంక్షల జోరు పెంచింది. మరిన్ని కఠిన చర్యలు తీసుకుంది.. ఆ దేశంతో ఇప్పటికే దౌత్య సంబంధాలు తెగతెంపులు చేసేసిన భారత్ ఇక వాణిజ్య లావాదేవీలు కూడా బంద్ చేసేసింది. తాజాగా ఎగుమతులు,దిగుమతులను రద్దు చేసింది. సముద్ర మార్గం ద్వారా ఇరు దేశాల వాణిజ్య, రవాణా ను కూడా నిలిపివేసింది.ఇకపై పాకిస్థాన్ జెండాతో ఉన్న నౌకలు మన పోర్టులలో కనపడవు.అంతేకాదు రెండు దేశాల మధ్య ఇకపై ఇన్ బౌండ్ మెయిల్స్, పార్సిల్స్ బట్వాడా కూడా జరగదు. విదేశీ వాణిజ్య కార్యాలయం డైరక్టరేట్‌ ఈమేరకు ఒక ప్రకటన చేసింది. ఈ ఆదేశాలు ఈనెల 2నుంచే అమల్లోకి వస్తున్నాయని ప్రకటించింది. భారత వాణిజ్య విధానంలో అదనంగా 20 ఏ నిబంధన లో ఈ ఎగుమతులు, దిగుమతుల నిషేధం విషయాన్ని ప్రత్యేకంగా ఒక పేరాలో ప్రకటించింది.
పాకిస్థాన్ భారత దేశాల మధ్య ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగా గానీ ఎగుమతులు, లేదా దిగుమతుల లావాదేవీలన్నింటినీ తదుపరి ఉత్తర్వులందేవరకూ తక్షణం నిలిపివేస్తున్నట్లు ఆ ఆదేశాలలో ఉంది. ఇది భారత జాతి భద్రతకోసం మన వాణిజ్య విధానంలో చేస్తున్న మార్పుగా ఈ నిషేధానికి ఏవైనా మార్పులు చేర్పులు చేయాలంటే భారత ప్రభుత్వ అనుమతి ఉండాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.
పాకిస్థాన్ తో వాణిజ్య నిషేధం ఆ దేశ ఎగుమతుల రంగానికి తీవ్రమైన దెబ్బ. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకున్న పాకిస్థాన్ కు ఇది అశనిపాతం లాంటి వార్త.మన దేశం గుండా సిమెంట్, టెక్స్ టైల్స్, వ్యవసాయ ఉత్పత్తులు పాక్ భౌగోళిక మార్గం ద్వారా కూడా విదేశాలకు వెడుతుంటాయి. ఇప్పటికే ఆ దేశం వాణిజ్యం దెబ్బతినగా, తాజా గా ఈ రవాణా మార్గం బంద్ చేయడం వల్ల పాక్ ఆర్థికంగా మరింత ఒత్తిళ్లకు గురవుతుంది. అయితే దీనికి పాకిస్థాన్ కూడా భారత్ తో వాణిజ్య బంధాలను తెగతెంపులు చేసుకుంది. ఈ రద్దు వల్ల భారత్ కు జరిగే నష్టం చాలా చాలా స్వల్పం.

పుల్వామా దాడి తర్వాత..

2019లో పుల్వామా దాడి తర్వాత భారత,పాకిస్థాన్ మధ్య వాణిజ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. పుల్వామా దాడికి నిరసనగా పాకిస్థాన్ పై 200 శాతం దిగుమతి సుంకాలు వేసింది. తాజా పళ్లు, సిమెంట్,పెట్రోలియం ఉత్పత్తులు, ఖనిజ వనరులు లాంటికి ఇవి వర్తిస్తాయి. అలాగే అత్యంత అనుకూల దేశపు వాణిజ్య హోదా (మోస్ట్ ఫేవర్డ్ స్టేటస్)ను కూడా మన దేశం రద్దు చేసింది. ఈ మధ్యకాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పడిపోయింది.

2024 ఏప్రిల్ నుంచి జనవరి 2025 మధ్య మనదేశం కేవలం 4 లక్షల డాలర్ల విలువైన దిగుమతులు మాత్రమే చేసింది. గతంలో ఇదే కాల వ్యవధిలో అంతకుముందు ఏడాది ఏకంగా 20 లక్షల డాలర్ల విలువైన దిగుమతులు మన దేశం చేసుకుందని వాణిజ్య వర్గాల సమాచారం.అలాగే మన దేశంనుంచి పాకిస్థాన్ కు చేసే ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. గతంలో ఇదే సమయంలో 1.1 బిలియన్ డాలర్ల ఎగుమతుల వాణిజ్యం నెరపితే అది ప్రస్తుతం 447 మిలియన్ డాలర్లకు పడిపోయింది.

అసలు 1947 నుంచీ భారత,పాకిస్థాన్ దేశాల మధ్య వాణిజ్యం బలహీనంగానే ఉంది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో అనేక ఆటుపోట్లు ఎదురయ్యాయి. అదే సమయంలో దుబాయ్ తో మన వర్తక సంబంధాలు ఎలాంటి అవాంతరాలు లేకుండానే కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం నెరపడంలో దుబాయ్ కీలక కేంద్రం. దుబాయ్ నుంచి బంగారం, నగలు, వస్త్రాలు, యంత్ర పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ దుబాయ్ ద్వారానే రెండు దేశాలకు చేరుతుంటాయి.

పెహల్గాంలో ఉగ్రదాడికి కారకులైన ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్థాన్ ఆర్మీ ప్రత్యేక బలగాలకు చెందిన మాజీ పారా కమాండో కావడం భారత్ ఆగ్రహానికి కారణమైంది. పాకిస్థాన్ ప్రమేయం ఉందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.అయినా పాకిస్థాన్ బుకాయిస్తూనే ఉంది. తామెలాంటి దాడులు జరపలేదని భారత్ మిలటరీ చర్యకు పూనుకుంటే తమ ప్రతిచర్య చాలా గట్టిగా ఉంటుందంటూ హెచ్చరికలు చేస్తోంది. పైగా అధీన రేఖ వద్ద ఉల్లంఘనలకు పాల్పడుతూ కవ్విస్తోంది.

దశల వారీగా తెగదెంపులు

పాకిస్థాన్ దుష్ట బుద్ధిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ దశల వారీగా ఆ దేశంతో తెగతెంపులు చేసుకుంటోంది. దౌత్యసంబంధాలను స్తంభింప చేయడమే కాక సింధు జలాల ఒప్పందాన్నికూడా రద్దు చేసింది. పాకిస్థాన్ గగనతలం నుంచి విమానాలు మన గగనతలంలోకి రాకుండా నిషేధించింది. ఇవన్నీ పాకిస్థాన్ ఎకానమీని దెబ్బతీసేవే.ఇక సింధుజలాలు ఆపితే పాకిస్థాన్ పంటలు కూడా ఎండిపోతాయి.
ఇందుకు ప్రతిగా పాకిస్థాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది.పాకిస్థాన్ గగన తలాన్ని మూసేసింది. వాఘా సరిహద్దును ముసేసింది. సింధు జలాలను ఆపితే అది యుద్ధానికి దిగడమేనని హెచ్చరించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com