27.9 C
Hyderabad
Saturday, June 27, 2026

Live Video

spot_img

ఆన్ లైన్ లో ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే.. చార్జ్ కట్టాల్సిందేనా?

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్లకు షాక్ ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్, మింత్రా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇకపై ఆర్డర్ పెట్టి.. ఆ తర్వాత క్యాన్సిల్ చేసే వాళ్ల నుంచి చార్జ్‌ వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు కొన్ని రిపోర్ట్‌లు చెబుతున్నాయి. అంటే ఒకవేళ ఆర్డర్ చేసి.. ఇకపై క్యాన్సిల్‌ చేసే వాళ్లకు ఫుల్‌గా డబ్బులు రీఫండ్ చేయకుండా ఎంతో కొంత అందులో నుంచి అమౌంట్ డిడక్ట్ అయ్యేలా మార్పులు చేయబోతున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఫ్లిప్ కార్ట్, మింత్రా.

అయితే ఈ వార్తలపై మింత్రా స్పందించింది. తాము అలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. కానీ ఫ్లిప్ కార్ట్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫ్లిప్‌కార్ట్‌ ఇంటర్నల్ మెసేజ్ లీక్‌ అవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎఫెక్ట్ గట్టిగానే పడే అవకాశం ఉంది. తమ సైట్ ద్వారా వస్తువులను సేల్ చేసే వారికి, లాజిస్టిక్‌ సప్లై చేసే వారు నష్టపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి ఓ టైమ్ డ్యూరేషన్ ఉంటుందని తెలుస్తోంది. అంతేగాకుండా ఐటమ్‌ను బట్టి ఈ చార్జ్ విధించే అవకాశం కనిపిస్తోంది. ఫ్లిప్ కార్ట్ వహిస్తున్న మౌనాన్ని బట్టి చూస్తుంటే ఈ వార్తలు నిజమనే అనిపిస్తున్నాయి. కానీ విషయం పూర్తిగా వెలుగులోకి వచ్చే వరకు మాత్రం కాస్త ఓపిక పట్టాల్సిందే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com