29.2 C
Hyderabad
Monday, June 15, 2026

Live Video

spot_img

12 మంది మావోయిస్టులు మృతి

చత్తీస్ఘడ్ పరిధిలోని దండకారణ్యంలో మావోయిస్టులు పోలీసులుకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టు మిలిటెంట్లు మృతి చెందారు. చత్తీస్ఘడ్ లోని అబూజ్మడ్ అటవీ రేంజ్ లో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య తీవ్ర స్ధాయిలో ఎదురు కాల్పులు జరిగాయి. నక్సలైట్ నిర్మూలనలో భాగంగా నారాయణపూర్, కొండగవ్, జగదల్ పూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన భద్రతా సిబ్బంది అబూజ్మడ్, బస్తర్ అటవీ ప్రాంతంలో కూబింగ్ చేపట్టాయి. భద్రతా దళాలు కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురు పడి కాల్పులు జరపడంతో భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు చేశాయి. గురువారం తెల్లవారు జామున 3 గంటల నుంచి ఇరువురి మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందినట్ల అధికార వర్గాలు దృవీకరించాయి. ప్రస్తుతం మావోయిస్టుల కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com