తిరుమల గిరులపై గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా తిరుమల కొండపై చలి తవ్రత పెరగడంతో భక్తుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏకాటిగా వర్షం పడుతుండటంతో కొండ చరియలు విరిగే ప్రమాదం ఉన్నందున సిబ్బంది అందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను వర్షం కారణంగా టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసి వేశారు. కొండపైన గోగర్భం, పాపవినాశనాలు పూర్తిగా నిండిపోయి నీరు ఓవర్ ఫ్లో అవ్వడంతో భక్తులు నడవడానికి, వాహనాలు తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇక ఘాట్ రోడ్డులలో ప్రయానించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాహదారులను టీటీడీ హెచ్చరించింది.
- Advertisement with us -