వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఇంతకాలం ఆ పార్టీ పంచన రాజకీయాలు చేసిన నాయకులు, మాజీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. స్థానికంగా నియోజకవర్గాల్లో ప్రాధాన్యత లేకపోవడం ఒకెత్తైతే అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా అనేక మంది నాయకులు వైఎస్సార్సీపీకి రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు, నలుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడి అధికార కూటమి పార్టీల పంచన చేరారు. తాజాగా భీమిలి మాజీ శాసనసభ్యుడు అవంతి శ్రీనివాస్, భీమవారం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ లు వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాలు చేశారు. వీరిద్దరూ కూడా అధికార కూటమి పార్టీల్లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- Advertisement with us -