30 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

నా తల్లి మీద ఒట్టేసి చెపుతున్నా…

నేను ఏ తప్పు చేయలేదు… పేర్నినాని

సోషల్ మీడియాలో తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు అన్నీ అవాస్తవమని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ రేషన్ బియ్యం మాయం కేసులో తనపై జరుగున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. అద్దెలకు ఇవ్వడం కోసమే గోడౌన్లు కట్టుకున్నామని తప్పుడు పనులు చెయ్యడానికి కాదని నానీ స్పష్టం చేశారు. అయితే నన్ను నా భార్య జయసుధని జనవరి 2వ తేదీలోగా ఏదోవిధంగా అరెస్ట్ చెయ్యాలని చూస్తున్నారని అందుకే కూటమి ప్రభుత్వ అనుకూల నేతలు, విశ్లేషకులు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పారిపోయానని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్.జగన్ కంటే నేను వాళ్ళకి మొదటి టార్గెట్ అని నా మీద ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్ళను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహరాంలో శాఖాపరమైన విచారణ కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందన్నారు. నేను మూడు సార్లు శాసనసభ్యునిగా రాష్ట్ర మంత్రిగా పని చేశానని ప్రభుత్వ నిబంధనలు ఏంటో నాకు తెల్సని నానీ అన్నారు. నా తల్లి మీద ఒట్టసి చెపుతున్నా నేను కానీ నా భార్య కానీ ఎటువంటి తప్పు చేయలేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు. కావాలనే నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com