23.4 C
Hyderabad
Thursday, July 30, 2026

Live Video

spot_img

మధ్య తరగతికి భారీ ఊరట.. రూ.12 లక్షల వరకూ నో టాక్స్

  • వేతన జీవులకు నిర్మల తీపి కబురు
  • రూ.12 లక్షల వరకూ ఆదాయానికి నోటాక్స్
  • అయితే ఇందులో రూ.8 లక్షలు సేవింగ్స్ లో ఉండాలి
  • కనీస ఆదాయ పన్ను పరిమితిరూ.4 లక్షలు
  • ఆదాయపు పన్ను శ్లాబుల సంఖ్య తగ్గింపు
  • మరో వారంలో కొత్త ఐటీ యాక్ట్ రూల్స్
  • ఐటీ యాక్ట్ చట్టం మరింత సరళీకరణ
  • ఓవరాల్‌ గా మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీగా నిర్మలమ్మ బడ్జెట్‌

దేశంలో మధ్యతరగతి వారికి, వేతన జీవులకు 2025-26 ఆర్థిక బడ్జెట్‌ లో భారీ ఊరట కల్పించారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. ఇకపై వార్షికాదాయం రూ.12 లక్షల వరకూ ఆదాయపు పన్ను ఉండదు. అంటే గత బడ్జెట్ తో పోలిస్తే ఇది రెట్టింపు చేసినట్లు. అయితే ఇందులో ఒక మెలిక ఉంది. వార్షికాదాయం 12 లక్షలు ఉన్న వారు అందులో రూ.8 లక్షల వరకూ పొదుపు చేస్తేనే ఈ రూల్‌ వర్తిస్తుంది. అంటే  ఏ శ్రేణి వారికైనా రూ. కనీస ఆదాయ పన్ను పరిమితి రూ.4 లక్షలుగా నిర్ణయించారు. ఇక ఆదాయ పన్ను శ్లాబుల సంఖ్యను కూడా తగ్గించారు. మధ్యతరగతే దేశానికి కీలకమన్న ప్రభుత్వం వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తెస్తామని ప్రకటించారు. అయితే ఈ ఊరట మినహాయిస్తే వారం రోజులలో రానున్న కొత్త పన్నుల విధానంలో చాలా కీలకమైన మార్పులు తేబోతున్నామని సూచన ప్రాయంగా ప్రకటించారు. అంటే ఇన్‌ కం టాక్సు చట్టంలో చాలా గట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పకనే చెప్పారు. ఐటి యాక్ట్ చట్టాన్ని మరింత సరళతరం చేస్తామని, చట్టంలోని నిబంధనలు, పదాలను 50 శాతం తగ్గించనున్నట్లు ప్రకటించారు.

ఈ సారి బడ్జెట్‌ లో సీనియర్ సిటిజన్స్ కి కూడా ఊరట కల్పించారు.సీనియర్ సిటిజన్స్ కి ప్రస్తుతం అమల్లో ఉన్న టీడీఎస్, టీసీఎస్ లను రూ.50 వేల నుంచి రూ.లక్షరూపాయలకు పెంచారు. అద్దె ఆదాయంపై టీడీఎస్ రూ.6 లక్షలకు పెంచారు. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.75 వేలకు పెంచారు.

బడ్జెట్‌ విశ్లేషకులు ఈఏడాది ఆదాయప్ను మినహాయింపు శ్లాబ్‌ పది లక్షల వరకూ ఉండొచ్చని అంచనా వేసినా అందుకు భిన్నంగా 12 లక్షలకు పెంచి నిర్మల అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అదే సమయంలో వార్షికాదాయం పన్ను శ్లాబులు ఈ విధంగా ఉన్నాయి.

వార్షికాదాయ పరిమితి రూ.12 లక్షలకు పెంపు

ఏ శ్రేణి వారికైనా రూ.4 లక్షల వరకూ పన్ను మినహాయింపు

రూ. 20 లక్షలు దాటితే 16 లక్షలనుంచి 20 లక్షల లోపు 20 శాతం

రూ. 20నుంచి 24 లక్షల వరకూ 25 శాతం

రూ. 25 లక్షలు దాటితే 30 శాతం పన్ను

ఓవరాల్‌ గా చూస్తే ప్రస్తుతానికి మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ గానే ఐటీ పన్నుల విధానం కనిపిస్తోంది.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com