అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జన్మతః పౌరసత్వం విషయంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఈ పౌరసత్వం ఆమోదించింది బానిసల పిల్లల కోసమే కానీ.. ప్రపంచంలో ఉన్నవాళ్లంతా వచ్చి ఇక్కడ స్థిరపడిపోవడానికి కాదన్నారు ట్రంప్. దీంతో ఆయన ఈ విషయంలో రాజీలేని పోరాటానికి రెడీ అయినట్టు తెలిపోయింది.
ఎవరు పడితే వారు అమెరికాకు వచ్చేస్తున్నారు.. అర్హతలు లేని వారి కోసం.. వారి పిల్లల కోసం కాదు.. ఈ రాజ్యాంగ సవరణ చేసింది.. అంటూ క్లారిటీ ఇచ్చారు ట్రంప్. వలసదారులుగా వచ్చి ఇక్కడే పిల్లలను కని వారికి పౌరసత్వం తీసుకోవడంపై ఇకపై ఉండదని తేల్చి చెప్పారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో జన్మతః పౌరసత్వం రద్దు కూడా ఒకటి.
ఇప్పటికే దీనికి సంబంధించిన బిల్లు అమెరికా సెనెట్ ముందుకు వచ్చింది. ఆ బిల్లు ప్రకారం అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసాలపై వచ్చిన వారి పిల్లలకు పౌరసత్వం ఇవ్వరు. కేవలం అమెరికన్ పౌరులు, చట్టబద్ధంగా అమెరికా శాశ్వత నివాసి, అమెరికా సాయుధ దళాలలో పనిచేస్తున్న వలసదారులకు జన్మించిన పిల్లలకు మాత్రమే జన్మతః పౌరసత్వం కల్పించాలనేది ఈ బిల్లు ఉద్దేశం.
ఈ బిల్లును ఆమోదించకపోతే ట్రంప్‌కు చిక్కులు తప్పవనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ ఆదేశాలను సియాటెల్‌లోని ఒక ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు ట్రంప్. సో.. బిల్లు పాస్ కాకపోతే ఫెడరల్ కోర్టుల్లో ట్రంప్‌కు చిక్కులు తప్పవనే చెప్పాలి.