25.5 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

రాశిఫలాలు…23.03.25 నుండి 29.03.25 వరకు

ఈవారం పండగలు–పర్వదినాలు…

  • 25, మంగళవారం, మతత్రయ ఏకాదశి
  • 28, శుక్రవారం, మాసశివరాత్రి
  • 29, శనివారం, క్రొత్త అమావాస్య

–––––––––––––––––––––––––––

మేషం… (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు, అవరోధాలు నెలకొన్నా అధిగమిస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం అందర్నీ ఆకట్టుకుంటుంది. పరిచయాలు పెరుగుతాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు అందుకుంటారు. రుణబాధలు సైతం తీర తాయి. చేజారిందనుకున్న సొమ్ము సైతం అంది ఆశ్చర్యం చెందుతారు. కుటుంబంలో మీ మానవతా విలువలు, ప్రేమానురాగాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. వివాహాది శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. బంధువులు మీపై మరింత నమ్మకంతో బాధ్యతలు అప్పగిస్తారు. అంతేకాకుండా కొన్ని వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆరోగ్యపరంగా మీ జాగ్రత్తలే కాపాడతాయి. దీర్ఘకాలికంగా వే«ధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త పెట్టుబడులు, భాగస్వాములు సమకూరతారు. ఉద్యోగాలలో లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు. పదోన్నతులు రాగలవు. రాజకీయవేత్తలకు పదవీయోగం. 23,24 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా సాగవు. శ్రీవిష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం… (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)

ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం మీదే. మీలోని దాణగుణం వెలుగులోకి వస్తుంది.ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.విద్యార్థులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కొంత నెమ్మదిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు.ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. ఇతరులకు సైతం సహాయం అందిస్తారు. రుణదాతల ఒత్తిడుల నుంచి బయటపడతారు. చివరిలో ఆకస్మిక ధనలాభం.  సంతానపరంగా ఇబ్బందులు అధిగమిస్తారు. బంధువుల తాకిడితో ఉత్సాహంగా గడుపుతారు. వివాహ సంబంధాలపై చర్చలు జరుపుతారు. ఒక సన్నిహిత వ్యక్తి గుర్తుకు రాగలరు.  ఆరోగ్యం మరింత మెరుగుదల కనిపిస్తుంది. ఔషధసేవనం, ఆస్పత్రుల సందర్శనానికి స్వస్తి చెబుతారు.వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. నూతన పెట్టుబడులతో విస్తరిస్తారు. భాగస్వాముల సలహాలు పాటిస్తారు.ఉద్యోగాలలో మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి మెప్పు పొందుతారు. అలాగే, పదోన్నతులు సైతం దక్కవచ్చు.పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 26,27 తేదీల్లో లేనిపోని వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. శ్రీ నృసింహస్తోత్రాలు పఠించండి.

మిథునం… (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు.ఎంతటి వారినైనా మాటలతో ఆకర్షిస్తారు.సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. చిరకాల ప్రత్యర్థుల నుంచి సైతం సహాయం అందుకుంటారు. వస్తులాబాలు.ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి.ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణదాతల ఒత్తిడులు సైతం తొలగుతాయి. ఇతరుల నుంచి సకాలంలో సొమ్ము అంది అవసరాలు తీరతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మనస్పర్థలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన రీతిలో బంధువులు చేదోడుగా నిలుస్తారు. కొద్దిపాటి రుగ్మతలు చికాకు పర్చినా చివరికి ఉపశమనం లభిస్తుంది.వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడులు విశేషంగా అందుతాయి. భాగస్వామ్య వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం. పైస్థాయి అధికారుల నుంచి సహాయం అందుకుంటారు.కళాకారులకు నూతనోత్సాహం. అవకాశాలు పెరుగుతాయి.25,26 తేదీల్లో బంధువుల నుండి ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఒప్పందాలు వాయిదా. శ్రీ అన్నపూర్ణాదేవి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం… (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)

వ్యవహారాలలో విజయం సాధిస్తారు.భూవివాదాలు పరిష్కారమవుతాయి. పట్టుదల, నేర్పుతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనయోగం. ప్రముఖులు పరిచయం కాగలరు. కాంట్రాక్టర్లకు విశేషంగా కలిసివస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.ఎంతోకాలంగా రావలసిన సొమ్ము అందడం విశేషం. దీర్ఘకాల రుణబాధల నుంచి విముక్తి. సోదరుల నుంచి ధనలాభం కలుగుతుంది.కుటుంబంలో మీ ప్రతిపాదనలు, సూచనలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. అందరి ఆదరణ పొందుతారు. దూరమైన ఒక వ్యక్తి తిరిగి దగ్గరకు చేరడం ఊరట కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. క్రమేపీ స్వస్థత చేకూరి ఉపశమనం పొందుతారు.వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు. భాగస్వాములు పెరుగుతారు. విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఆశించిన లాభాలు తథ్యం.ఉద్యోగాలలో విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. ఉన్నతపోస్టులు రావచ్చు. మంచి గుర్తింపు రాగలదు. రాజకీయవేత్తలకు పదవులు, హోదాలు దక్కుతాయి. 28,29 తేదీలలో ముఖ్య ఒప్పందాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మానసిక అశాంతి. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.

సింహం… (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

మొదట్లో కొంత సబ్దుగా ఉన్నా క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి.విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మిత్రులతో విభేదాలు తొలగుతాయి. అనుకున్నది సా«ధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థికంగా మరింత అనుకూలిస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఆప్తుల నుంచి ధనలాభ సూచనలు. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా లబ్ది చేకూరుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత. వివాహాది శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. కీలక వ్యక్తి అందించే సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అరమరికలు, దాపరికాలు లేకుండా నిర్మొహమాటంగా మనస్సులోని అభిప్రాయాలను వెల్లడిస్తారు. శారీరక రుగ్మతలు కొంత ఇబ్బంది పెట్టినా క్రమేపీ ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఆశించిన విధంగా లాభాలు దక్కుతాయి. విస్తరణయత్నాలు సానుకూలం.ఉద్యోగాలలో మీపై ఉంచిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి సత్తా చాటుకుంటారు. పైస్థాయి వారి ప్రశంసలు అందుకుంటారు.పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. 23,24 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. వివాదాలకు దూరంగా ఉండండి. కీలక నిర్ణయాలలో మార్పులు. దూరప్రయాణాలు. శ్రీ ఆంజనేయ దండకం పఠించండి.

కన్య… (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము నిదానంగా అందుతుంది. రుణదాతల ఒత్తిడుల నుంచి కాస్త బయటపడతారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాల సందడితో ఉత్సాహంగా గడుపుతారు. దూరపు బంధువులను ఆహ్వానిస్తారు.  భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆరోగ్యపరంగా కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే ఏదో ఒక రుగ్మత చికాకు పరుస్తూనే ఉంటుంది. వ్యాపారాలలో లాభాల దిశగా సాగుతారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. భాగస్వాములు మరింత చేయూతనందిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం. ఉన్నతాధికారులు మరింత సహకరిస్తారు. విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.24,25 తేదీలో వివాదాలు. మానసిక అశాంతి. కీలక నిర్ణయాలు. శ్రీ దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

తుల… (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

కొత్త పనులకు శ్రీకారం చుడతారు.ఆలోచనలు అమలు చేస్తారు.సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు.తీర్థయాత్రలు చేస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇతరుల వద్ద నిలిచిపోయిన సొమ్ము కూడా అందుతుంది. బంధువుల నుంచి ధనలాభాలు ఉంటాయి. రుణాలు తీరతాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణతో ఉత్సాహంగా గడుపుతారు. సభ్యులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. సంతానంతో మరింత ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ ప్రతిపాదనలు అందరూ అంగీరిస్తారు. శారీరక రుగ్మతల నుంచి బయటపడతారు. బలం పుంజుకుంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. 26,27 తేదీల్లో చర్చలలో విఘాతం, ధనవ్యయం. నిర్ణయాలు మార్చుకుంటారు. శ్రీ గురుదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం… (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు.ఆలోచనలు స్థిరం ఉండవు.ప్రత్యర్థులు సమస్యలు కల్పించి చికాకు పరుస్తారు.విద్యార్థులు, నిరుద్యోగులు శ్రమ పడ్డా ఫలితం పొందలేరు. వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి.కోర్టు వ్యవహారాలు మరింత చికాకు పరుస్తాయి.ఆలయాలు సందర్శిస్తారు.రావలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. కొంత సొమ్ము చేజారే సూచనలు. కుటుంబసభ్యుల మధ్య అపార్థాలు, అపోహలు నెలకొంటాయి. మీ నిర్ణయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. ఆహారవిహారాదులపై పరిమితులు అవసరం. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. ఔషధసేవనం తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే. పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో హఠాత్తుగా మార్పులు జరుగుతాయి. పైస్థాయి వారి నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా. 23,24 తేదీల్లో శుభవర్తమానాలు. అదనపు రాబడి. ఆహ్వానాలు అందుకుంటారు. శ్రీవారాహీ స్తోత్రం పఠించండి.

ధనుస్సు… (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పెండింగ్‌బాకీలు వసూలవుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు.  కుటుంబంలో ఉత్సాహపూరితంగా ఉంటుంది. మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహయత్నాలు సానుకూలం.ఆరోగ్యపరంగా మరింత మెరుగుదల కనిపిస్తుంది. వైద్యసేవలకు స్వస్తి చెబుతారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో పుంజుకుంటాయి. ఆశించిన లాభాలు తథ్యం.ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు రాగలవు. అలాగే, విధి నిర్వహణలో మంచి గుర్తింపు రాగలదు. రాజకీయవేత్తలకు పదవీయోగం. 27,28 తేదీల్లో కుటుంబంలో ఒత్తిడులు, సమస్యలు. కొన్ని వివాదాలతో ఇబ్బందిపడతారు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. శ్రీ కాలభైరవాష్టకం పఠించండి.

మకరం… (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.పనులు చకచకా సాగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం.ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. రుణాలు తీరతాయి. కుటుంబంలోని అందరితోనూ సఖ్యతగా మెలగుతారు. దూరపు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. చిన్ననాటిజ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు.  శుభకార్యాలపై చర్చలు ఫలిస్తాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు కాగలవు. పెట్టుబడులకు ఢోకా ఉండదు.ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉత్సాహాన్నిస్తాయి. మీకంటూ ప్రత్యేక గుర్తింపు రాగలదు.పారిశ్రామికవేత్తలకు అనూహ్యమైన ఆహ్వానాలు అందుతాయి. కొత్త సంస్థలు ఏర్పాటులో విజయం సాధిస్తారు. 26,27 తేదీల్లో మిత్రులతో కలహాలు. కుటుంబంలో సమస్యలు. దూరప్రయాణాలు. శ్రీ భువనేశ్వరీదేవి స్తోత్రాలు పఠించండి.

కుంభం… (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

నూతనోత్సాహంతోకార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆస్తుల క్రయవిక్రయాలలో లాభాలు అందుతాయి. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధువులు తోడ్పాటు అందిస్తారు. సోదరులు, సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.శారీరక రుగ్మతలు తొలగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. లాభాలు తథ్యం.ఉద్యోగాలలో పదోన్నతులు రాగలవు. విధుల్లో ప్రశంసలు అందుతాయి. పైస్థాయి నుంచి పిలుపు రావచ్చు.రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 28,29 తేదీల్లో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మనశ్శాంతి లోపం. కావలసిన వారితో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రీ మేధా దక్షిణామూర్తి స్తుతి మంచిది.

మీనం… (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి)

అనుకున్న పనులలో విజయం సాధిస్తారు.విలువైన సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది. చర్చలు సఫలం.భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.స్నేహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలోని అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య ఆప్యాయత, అనురాగాలు బలపడతాయి. ఎటువంటి దాపరికాలు లేకుండా మీరుతీసుకున్న నిర్ణయాలు ప్రశంసలు అందుకుంటాయి. కొద్దిపాటి రుగ్మతలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు కాగలవు.ఉద్యోగాలలో పదోన్నతులు దక్కవచ్చు. పైస్థాయి అధికారుల మన్ననలు పొందుతారు. కళాకారులకు సంతోషకరమైన సమాచారం. 25,26 తేదీలలో మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. శ్రీ ఆదిత్య హృదయం పఠించండి.

–––––––––––––––––––––––––––––––––

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com