38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

కూటమి లేకపోతే చంద్రబాబు గెలిచేవారు కాదు

తెలంగాణ సమస్యల వలయంలో ఉంది – కేసీఆర్‌

పదేళ్ళుగా తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవని, ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఆ నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీనామెడపై కత్తి పెట్టినా కూడా తెలంగాణ కోసం నేను ఎక్కడా వెనుకడుగు వేయలేదని కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ ప్రజలందరూ ఒక కేసీఆర్‌ లా తయారు అయ్యి రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదని అధికర గర్వంతో వ్యవహరించరాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టకున్నా రైతు బంధు, కళ్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌ పార్టీదే అని కేసీఆర్‌ చెప్పారు. మనల్ని బలవంతంగా ఆంధ్రాలో కలిపారని, ఆతరువాత తెలంగాణను ఇందిరాగాంధీ కూడా మోసం చేసిందన్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో జనసేన, బీజేపీలతో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదని కేసీఆర్‌ అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com