ముఖ్యమైన పండగలు-పర్వదినాలు..
24, సోమవారం, మతత్రయ ఏకాదశి
26, బుధవారం, మహాశివరాత్రి
——————————–
మేషం
కొత్త వ్యక్తుల పరిచయం.శుభకార్యాలకు హాజరవుతారు.మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం రాగలదు. వాహనాలు, ఆభర ణాలు కొంటారు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.విద్యార్థులకు మరింత ఉత్సాహం.ఎంతోకాలంగా రావలసిన సొమ్ము అందుతుంది. ఆకస్మిక ధనలాభాలు. కుటుంబంలో మీ ఊహలు నిజం కాగలవు. బంధువులు, సోదరులతో సఖ్యత. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు మరింతగా పెరుగుతాయి. సంతానం విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.అస్వస్థత నుంచి కోలుకుంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. కొత్త భాగస్వాములు చేరిక సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగాలలో ఒక సమాచారం ఊరటనిస్తుంది. ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు సఫలం.మహిళలకు ఆస్తిలాభ సూచనలు..24,25 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. కుటుంబంలో ఒత్తిడులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
వృషభం
వ్యూహాత్మక వైఖరితో శత్రువులను కూడా మెప్పిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి.వ్యవహారాలలో విజయం సాధిస్తారు.పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. వాహనాలు, స్థలాలుకొంటారు.అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో అడుగు ముందుకు వేస్తారు.ఆలయాలు సందర్శిస్తారు.దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. సోదరుల నుంచి కూడా సహాయం అందుతుంది.కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. సంతానం ద్వారా మంచి గుర్తింపు రాగలదు.కొద్దిపాటి రుగ్మతలు కొంత బాధిస్తాయి.వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి.ఉద్యోగులకు కోరుకున్న మార్పులు తథ్యం. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు దక్కే అవకాశం.రాజకీయవేత్తలు, కళాకారులకు సత్కారాలు జరుగుతాయి. విదేశీ యానం. మహిళలకు కుటుంబసమస్యలు తీరతాయి. 23,24 తేదీల్లో దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ధనవ్యయంగణేశాష్టకం పఠించండి.
మిథునం
ఎంతోకాలంగా నిరీక్షణ ఫలించి నిరుద్యోగులు సంతోషిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవమర్యాదలు పొందుతారు. మీమాటకు తిరుగులేదన్నట్లుగా ఉంటుంది. శత్రువులను కూడా ఆకర్షిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. మీ జీవితంలో ఒక సంఘటన మలుపు తిప్పవచ్చు. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. రుణాలు తీరి ఉపశమనంపొందుతారు. మరింత ధనలాభాలు కలుగుతాయి. భార్యాభర్తలు, సోదరీసోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. అలాగే, శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానపరంగా కొంతకాలంగా ఎదురవుతున్న సమస్యలు తీరతాయి. ఆరోగ్యసమస్యల నుంచి గట్టెక్కుతారు. మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది.వ్యాపారాలు కొత్తపెట్టుబడులతో మరింతగా విస్తరిస్తారు. ఆశించిన లాభాలు కూడా దక్కుతాయి.ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉంటాయి. విధి నిర్వహణలో భయాందోళనలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.మహిళలకు విశేష గౌరవం దక్కుతుంది. 27,28 తేదీల్లో కుటుంబంలో కొన్ని సమస్యలు. మానసిక అశాంతి. వివాదాలు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం
ఎంతటి కార్యాన్నైనా దీక్షతో పూర్తి చేస్తారు.మీపట్టుదల, నైపుణ్యతను అందరూ గుర్తిస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి ఉపశమనం పొందుతారు.వేడుకల్లో పాల్గొంటారు.విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.పెండింగ్ బాకీలు కూడా అప్రయత్నంగా వసూలవుతాయి. ఇబ్పందులు తొలగుతాయి. కుటుంబంలోని అందరితోనూ మీ భావాలను పంచుకుంటారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మిమ్మల్ని వ్యతిరేకించినవారు సైతం మద్దతుగా నిలుస్తారు. సంతానరీత్యా మంచి పేరు లభిస్తుంది. ఒక సంతానం విదేశీ పర్యటనలకు ఏర్పాట్లు చేస్తారు.ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. .వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. విస్తరణలో ముందడుగు వేస్తారు.ఉద్యోగులకు శ్రమ వృథా కాదు. మీసేవలకు తగిన గుర్తింపు రాగలదు.పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి.మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 28,1 తేదీల్లో దుబారా వ్యయం. సన్నిహితుల నుండి ఒత్తిడులు. ఆస్తి ఒప్పందాలు వాయిదా. హనుమాన్ ఛాలీసా పఠించండి.
సింహం
వీరికి అన్నీ శుభశకునాలే. ఆలోచనలు అమలు చేసి ముందడుగు వేస్తారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యాలకు హాజరవుతారు.స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. చేజారిన సొమ్ము కూడా అందే సూచనలు. ఆదాయం కూడా కొంత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు సంతానానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. విదేశాలలో ఉన్న ఒకరు స్వదేశానికి రావచ్చు. కొద్దిపాటి రుగ్మతలు ఎదుర్కొంటారు. ఔషధసేవనం. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరి లాభాలు అందుతాయి. ఉద్యోగులు మీ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. ప్రమోషన్లు దక్కవచ్చు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం దక్కుతుంది. 25,26 తేదీలలో ఇంటాబయటా గందరగోళం. వివాదాలకు దూరంగా ఉండండి. ధననష్టం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కన్య
ఉత్సాహపూరితంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కాగల కార్యం గంధర్వులు నెరవేర్చినట్లుగా మీరు తలపెట్టిన కార్యాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. శత్రువులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. మీ నేర్పు, ఓర్పు ఆయుధాలుగా ఉపయోగపడతాయి. జీవితాశయం నెరవేరే సమయం. అవసరాలకు తగినంత సొమ్ము అందుతుంది. ఎంతోకాలంగా పెండింగ్‌లో పడిన బకాయిలు అందుతాయి. కుటుంబంలోని అందరి ఆప్యాయత, అనురాగం పొందుతారు. భార్యాభర్తల మధ్య కొద్దికాలంగా నెలకొన్న వివాదాలు పరిష్కారమవుతాయి. సంతానవిషయంలో మీ ఆశలు ఫలిస్తాయి. మొదటి సంతానానికి సంబంధించి శుభవర్తమానాలు.శారీరక రుగ్మతలు తొలగుతాయి. వ్యాపారులు లాభాలు గడించేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి. పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి పేరుగడిస్తారు. పారిశ్రామికవేత్తలు,కళాకారులకు నూతనోత్సాహం.మహిళలకు మానసిక ప్రశాంతత. 23,24 తేదీల్లో కుటుంబంలో కొన్ని సమస్యలు. దూరప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు.నృసింహస్తోత్రాలు పఠించండి.
తుల
వ్యవహారాలు విజయవంతంగా కొనసాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యవహరించి సమస్యలు పరిష్కరించుకుంటారు. సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తి విషయాలలో బంధువులతో తగాదాలు పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. రావలసిన సొమ్ము అందుతుంది. ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబంలో మీ ప్రతిపాదనలు సభ్యులంతా ఆమోదిస్తారు. కొద్దిపాటి రుగ్మతలు నెలకొన్నా ఉపశమనం పొందుతారు. ఉద్యోగులు విధి నిర్వహణలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన విధంగా పెట్టుబడులు అందుతాయి. విస్తరణ యత్నాలు కలసివస్తాయి. రాజకీయవర్గాల వారు సన్మానాలు, సత్కారాలతో బిజీగా గడుపుతారు. మహిళలకు కుటుంబసభ్యుల నుంచి ఆశించిన ప్రోత్సాహం అందుతుంది. 26,27 తేదీల్లో లేనిపోని వివాదాలు. కష్టానికి ఫలితం ఉండదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం
అనుకున్న కార్యాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. స్నేహితులే శత్రువుల్లా మారి ఆటంకాలు సృష్టించవచ్చు. ఆలోచనలు కలసిరావు.ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు.మీ సహనాన్ని పరీక్షించేందుకు కొందరు యత్నిస్తారు, అప్రమత్తంగా ఉండండి.కష్టానికితగిన ఫలితం దక్కడం అనుమానమే. రావలసిన సొమ్ము సకాలంలో అందక ఇబ్బందులు పడతారు. మరోవైపు రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. దీంతో కొన్ని ఒప్పందాలు సైతం వాయిదా వేస్తారు. భార్యాభర్తల మధ్య లేనిపోని అపార్ధాలు, సంతానపరంగా చికాకులు. రెండవ సంతానంఆరోగ్యంపై ఆదుర్దా చెందుతారు. మీపై మోపబడిన నిందల నుంచి బయటపడేందుకు యత్నిస్తారు.నరాలు, నేత్ర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కక డీలా పడతారు. పెట్టుబడుల్లో నిదానం పాటించండి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు అనుమానమే. పైస్థాయి అధికారులనుంచి సమస్యలు ఎదుర్కొంటారు. రాజకీయవేత్తలకు పదవులు కొంత నిరాశ పరుస్తాయి.మహిళలకు మానసిక అశాంతి. 27,28 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ధనలాభం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు
సన్నిహితులు, స్నేహితులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. అనుకున్న రాబడి దక్కి అప్పులు చేస్తారు. కుటుంబసమస్యల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపారాల విస్తరణయత్నాలు కొంత నెమ్మదిగా సాగుతాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉండవచ్చు. కళాకారులకు కొన్ని అవకాశాలు దగ్గరకు వచ్చి ఆశ్చర్యపరుస్తాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. 28,1 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. విష్ణుధ్యానం చేయండి.
మకరం
పనుల్లో విజయం సాధిస్తారు. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. కొన్ని సమస్యలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. పట్టుదల, సాహసంతో ముందడుగు వేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. రావలసిన డబ్బు అందుతుంది. రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. శుభకార్యాలను నిర్వహిస్తారు. శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లబిస్తాయి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కళాకారులకు అవార్డులు, రివార్డులు అందుతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 25,26 తేదీల్లో మానసిక సంఘర్షణ. కుటుంబంలో వివాదాలు. కొన్ని కష్టాలు భరించాల్సిన సమయం. ఆదిత్య హృదయం పఠించండి.
కుంభం
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తులతో విభేదాలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. బాకీలు అందుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తీరతాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి.వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అంది వ్యాపారాలు విస్తరిస్తారు. వాణిజ్యవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగాలలో మీ శ్రమ వృథా కాదు. పైస్థాయి వారి నుంచి ప్రోత్సాహం అందుతుంది. రాజకీయవేత్తలకు పదవీయోగం. సన్మానాలు జరుగుతాయి. మహిళలకు నూతనోత్సాహం.28,1 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. నృసింహస్తోత్రాలు పఠించండి.
మీనం
ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. శ్రమకుఫలితం కనిపిస్తుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ ఆశయాలు సాధిస్తారు.భూములు, భవనాలు కొంటారు. దేవాలయాల సందర్శనం. అప్పులు తీరి ఊరట లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం. కుటుంబంలో అందరితోనూ సఖ్యత నెలకొంటుంది. శుభకార్యాల ప్రస్తావన. ఉద్యోగాలలో అనుకున్న బదిలీలు పొందుతారు. పదోన్నతులు లభించే సమయం.వ్యాపారాలలో లాభాల బాటలో పయనిస్తారు. పెట్టుబడులు అందుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. మహిళలు సోదరులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. 26,27 తేదీల్లో దుబారా ఖర్చులు. బంధువుల నుండి ఒత్తిడులు. కీలక నిర్ణయాలు వాయిదా.ఆంజనేయ దండకం పఠించండి.