ముఖ్యమైన విశిష్ఠరోజులు..
27, సోమవారం, మాసశివరాత్రి.
29, బుధవారం, చొల్లంగి అమావాస్య.
మేషం…(అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
కీలక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తి విషయాలలో బంధువులతో తగాదాలు పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. అనూహ్యమైన రీతిలో ధనలాభాలు కలుగుతాయి. అప్పులు కొంతమేర తీరి ఊరట చెందుతారు. ఆస్తుల ఒప్పందాల ద్వారా కూడా ధనలబ్ధి కలుగుతుంది. అయితే ఖర్చులు కూడా పెరగవచ్చు. కుటుంబసభ్యుల్లో ఆత్మవిశ్వాసం పెంచుతారు. దృఢ∙సంకల్పంతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరించుకుంటారు. శుభకార్యాలకు విశేషంగా ఖర్చు చేస్తారు. సోదరులు, సోదరీల నుంచి ఉపయుక్తమైన సమాచారం అంది ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారులకు ఆశించిన విధంగా పెట్టుబడులు అందుతాయి. విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. రాజకీయ, పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలమవుతాయి. ఐటీ, న్యాయవాద వృత్తులు వారి కృషి ఫలిస్తుంది. 26,27 తేదీల్లో దూరప్రయాణాలు. మానసికంగా ఆందోళన. కీలక చర్చలు విఫలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
వృషభం…(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)
అనుకున్న కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. మిత్రులతో కష్టసుఖాలు పంచుకుని ఆనందంగా గడుపుతారు. మీ ఆశయాలు సాధించడంలో సఫలమవుతారు. భూములు, భవనాలు కొంటారు. దేవాలయాల సందర్శనం. ఆస్తుల విషయంలో నెలకొన్న ఇబ్బందులు, సమస్యలు తీరతాయి. డబ్బుకు కొదవ ఉండదు. అవసరాలకు తగినంత సొమ్ము అందుతుంది. రుణభారాల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. కుటుంబంలో సంతోషదాయకంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో సమస్యలు పరిష్కరించుకుంటారు. సోదరులు,సోదరీలతో సఖ్యత నెలకొని ఊపిరిపీల్చుకుంటారు. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపారుల కొత్త నిర్ణయాలు, వ్యూహాలు ఫలిస్తాయి. భాగస్వాములు సైతం మీకు అనుకూలంగా మారతారు. లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు చాలవరకూ తీరతాయి. పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాల వారు యుక్తిగా వ్యవహరించి విజయాల వైపు సాగుతారు. క్రీడాకారులు, ఐటీ రంగం వారికి విజయాలు చేకూరతాయి. 28,29 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. గణేశ్‌ను పూజించండి.
మిథునం..(మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
అనుకున్న కార్యక్రమాలలో ప్రతిష్ఠంభన తొలగి ముందుకు సాగుతారు. ఆశ్చర్యకరమైన రీతిలో ఉద్యోగావకాశాలు దక్కుతాయి. సన్నిహితులు, స్నేహితులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. రుణఒత్తిడులు చాలావరకూ తొలగుతాయి. ఇతరుల వద్ద ఎంతోకాలంగా నిలిచిపోయిన డబ్బు సైతం అందడం ఆశ్చర్యపరుస్తుంది. కుటుంబంలో మీరంటే అభిమానం మరింత పెరుగుతుంది. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్యం కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. వ్యాపార విస్తరణయత్నాలు కొంత నెమ్మదించినా లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తీరతాయి. విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. వైద్యులు, రాజకీయవేత్తలకు నూతన అవకాశాలు. విశేష ఆదరణ లభిస్తుంది. ఐటీ రంగం వారికి చెప్పుకోతగిన ప్రయోజనాలు చేకూరతాయి. 31,1 తేదీల్లో వృథా ఖర్చులు. కొన్ని సమస్యలు వెంటాడతాయి. మానసిక అశాంతి. విష్ణుధ్యానం మంచిది.
కర్కాటకం..(పునర్వసు 4వ పాదం, పుష్యణి, ఆశ్లేష)
ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ఆకస్మిక ధనలబ్ధి. ఆస్తులు, షేర్లు క్రయవిక్రయాల ద్వారా కూడా లాభాలు గడిస్తారు. ఖర్చులు కూడా పెరిగినా అవసరాలకు లోటు రాదు. కుటుంబంలో అందరితోనూ సంతోషంగా గడుపుతారు. సంతానపరంగా నెలకొన్న చికాకులు తొలగి ఊరట చెందుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. నలత చేసినా ఉపశమనం పొందుతారు. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన లాభాలు దక్కించుకుంటారు. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు అనుకూల సమయం. అయితే కొన్ని మార్పులు కూడా సంభవం. కళాకారులు, రాజకీయవేత్తలకు మరింత ఆదరణ లభిస్తుంది. వ్యవసాయదారులు, క్రీడాకారులకు సకాలంలో చేయూత అందుతుంది. 30,31 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. కనకదుర్గాదేవిని పూజించండి.
సింహం…(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
కొత్త పనులకు శ్రీకారం చుట్టడమే కాకుండా వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు అమలుచేసి ముందుకు సాగుతారు. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు,ఆభరణాలు కొంటారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. అవసరాలను మించి డబ్బు సమకూరుతుంది. కొంత పొదుపు కూడా పాటిస్తారు. షేర్ల క్రయవిక్రయాల ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది. కుటుంబంలోని అందరితోనూ సంతోషంగా గడుపుతారు. మీపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుని ముందుకు సాగుతారు. ఆస్తుల వ్యవహారాలలో ఒక ఒప్పందం చేసుకుంటారు. ఆరోగ్యం మరింత కుదుటపడుతుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా అడుగువేస్తారు. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తల యత్నాలు కొలిక్కి వస్తాయి. క్రీడాకారులు, వైద్యుల సేవలకు గుర్తింపు లభిస్తుంది. 27,28 తేదీల్లో వృథా ధనవ్యయం. ప్రతి విషయంలోనూ ఒత్తిడులు. మానసిక ఆవేదన. గణేశాష్టకం పఠించండి.
కన్య…(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ శ్రేయోభిలాషులు సలహాలను పాటిస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. అందరిలోనూ మీరంటే ప్రత్యేకత చాటుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తుల విషయంలో అనుకున్న లబ్ది చేకూరుతుంది. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఇతరుల వద్ద బాకీలు సైతం వసూలవుతాయి. ఖర్చులు పెరిగినా తట్టుకుంటారు. అందరి పట్ల ప్రేమాభిమానాలు చూపుతారు. బంధువుల నుంచి సహాయం అందుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరులతో విభేదాలు తొలగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడంలో విజయం సాధిస్తారు. పెట్టుబడులు పెట్టేందుకు మంచిది. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహం. ఐటీ రంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. 29,30 తేదీలలో దూరప్రయాణాలు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. శివాష్టకం పఠించండి.
తుల…(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కార్యక్రమాలలో ఊహించని జాప్యం. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఎంతగా కష్టించినా అనుకున్న ఫలితం పొందలేరు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. సన్నిహితుల నుంచి విమర్శలు సైతం ఎదుర్కొంటారు. గృహ నిర్మాణయత్నాలు వాయిదా పడతాయి. రావలసిన సొమ్ము అందక ఇబ్బందిపడతారు. అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా కూడా ఆశించిన సొమ్ము అందదు. కుటుంబంలో విమర్శలు పెరుగుతాయి. ప్రతివిషయంలోనూ మీపై నెపాలు మోపుతారు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్యం కొంత సహకరించకపోవచ్చు. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి.పెట్టుబడుల్లో తొందరవద్దు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు జరిగే అవకాశాలు. విధులు మరింత జాగ్రత్తగా నిర్వర్తించాలి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వ్యయప్రయాసలు. వైద్యులు, ఐటీ రంగం వారి కృషి అంతగా ఫలించకపోవచ్చు. 29,30 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. వృశ్చికం…(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
వృశ్చికం…(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని కీలక సమావేశాల్లో పాల్గొంటారు. పెండింగ్‌కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ముందడుగు వేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి లాభం. గృహ నిర్మాణాలు చేపట్టే వీలుంది. మీ ఆలోచనలు పదిమందితోనూ పంచుకుంటారు. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. రావలసిన సొమ్ము అందుతుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆస్తుల క్రయవిక్రయాలు కూడా లాభించి లబ్ది పొందుతారు. కొన్ని ఖర్చులు పెరిగినా లెక్కచేయరు. పెద్దల సలహాల మేరకు మీ నిర్ణయాలు మార్చుకుంటారు. శుభకార్యాలతో సందడిగా ఉంటుంది. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆరోగ్యం చక్కబడి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. పెట్టుబడులు కూడా సమకూరతాయి. ఉద్యోగాలలో అదనపు విధులు చేపడతారు. కొందరికి పదోన్నతి అవకాశాలు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. క్రీడాకారులు, వ్యవసాయదారుల యత్నాలు ఫలించే సమయం. 31,1 తేదీల్లో దుబారా వ్యయం. మనస్సు చంచలంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదిత్య హృదయం పఠించండి.
ధనుస్సు…(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
కొన్ని కార్యక్రమాలు∙ నెమ్మదిగా పూర్తి చేస్తారు. మిత్రులు, సన్నిహితులతో వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సలహాలు పాటిస్తారు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు రావచ్చు. కొంత సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. శుభకార్యాలకు సైతం డబ్బు వెచ్చిస్తారు. కుటుంబంలో సంతోషాన్ని పంచుకుంటారు. శుభకార్యాలతో హడావిడిగా గడుపుతారు. సోదరులు, సోదరీలతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ముందడుగు వేస్తారు. ఎటువంటి బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు ఉంటాయి. ఐటీ రంగం వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. 26,27 తేదీల్లో ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. కొన్ని ఒప్పందాలలో ఆటంకాలు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.
మకరం..(ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కార్యక్రమాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆత్మీయులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఎంతటి వారినైనా మీ మాటలతో ఆకర్షిస్తారు. డబ్బుకు లోటు ఉండదు. రెండుమూడు విధాలుగా ధనప్రాప్తి. ఆస్తులు, షేర్ల విక్రయాలు కూడా లాభించి డబ్బు సమకూరుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అందరినీ ఆకట్టుకుని సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్య సమస్య నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగులు కోరుకున్న మార్పులు పొందుతారు. ఉన్నతోద్యోగుల సహాయసహకారాలు అందుతాయి. వి«ధి నిర్వహణలో సత్తా చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు అనుకున్న అవకాశాలు పొందుతారు. క్రీడాకారులు వైద్యరంగం వారికి ఆహ్వానాలు రాగలవు. 28,29 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. మనస్సు స్థిరంగా ఉండదు. కష్టానికి ఫలితం కనిపించదు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కుంభం….(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ముఖ్య కార్యక్రమాలలో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషులతో ముఖ్య విషయాలను చర్చిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. సేవాభావం పెరుగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఇంటాబయటా మీ మాటే చెల్లుబాటు కాగలదు. పెండింగ్‌బాకీలు కూడా వసూలవుతాయి. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఆస్తులు, షేర్ల క్రయవిక్రయాలు వల్ల కూడా లబ్ధి పొందుతారు. రుణదాతల ఒత్తిడుల నుంచి బయటపడతారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ సత్తాను, ప్రతిభను అందరూ గుర్తిస్తారు. బంధువులు మీకు చేదోడుగా నిలుస్తారు. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరిస్తారు. కొత్తపెట్టుబడులు అందుతాయి. భాగస్వాములతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు పొందుతారు. పైస్థాయిలో ప్రోత్సాహం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహం. ఐటీ రంగ వారు ప్రతిభను నిరూపించుకుంటారు. 30,31 తేదీల్లో దూరప్రయాణాలు. కొన్ని అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
మీనం…(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరబాద్ర, రేవతి)
అనుకున్న కార్యక్రమాలను ఎలాంటి విఘాతాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దేవాలయ దర్శనాలు. మిత్రులతో తగాదాలు తీరతాయి. ఆస్తుల విషయంలో చికాకులు కాస్త తొలగుతాయి. వాహనయోగం కలుగుతుంది. చిరకాల ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. ఎటువంటి ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. రెండు మూడు విధాలుగా ధనప్రాప్తి. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా అనుకున్న లాభాలు అందుతాయి. కుటుంబంలో కొన్ని విమర్శలు ఎదురైనా పట్టించుకోకుండా ముందుకు సాగుతారు. బంధువులు మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు లభిస్తాయి. విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో ∙శ్రమపడ్డా తగిన గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు ఖరారు. వైద్యులు, ఐటీ రంగం వారు సత్తా చాటుకుంటారు. 31,1 తేదీల్లో లేనిపోని ఖర్చులు. అనారోగ్యం. మానసిక ఆందోళన. శివపంచాక్షరి పఠించండి.