32.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

హుస్సేన్‌సాగర్‌ ప్రమాదంలో ఒక యువకుడి మిస్సింగ్‌

అగ్నిప్రమాద బాధితుల్లో ఒకరి పరిస్ధితి విషమం

హుస్సేన్ సాగర్‌లో పర్యాటక శాఖకు చెందిన బోట్‌కి అగ్నిప్రమాదం జరగడం వల్ల గాయపడిన ముగ్గురు వ్యక్తులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. బోట్‌లో టపాకాయలు కాల్చేందుకు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన గణేష్‌ అనే యువకుడు ఈ అగ్నిప్రమాదంలో తవ్రంగా గాయపడ్డాడు. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణేష్‌ పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెపుతున్నారు. ఇదే ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడ్డ హైదరాబాద్‌ అంబర్‌పేటకు చెందిన కష్ణ, హుజూరాబాద్‌కు చెందిన సాయిచంద్‌లకు వైద్యచికిత్స అందిస్తున్నారు. అనుమతి లేకుండా నిర్వాహకులు బోట్‌లో క్రాకర్స్‌ కాల్చినట్లు సమాచారం. ఈప్రమాదంలో పర్యాటక శాఖకు చెందిన రెండు బోట్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో పర్యాటకశాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని యాత్రికులు ఆరోపిస్తున్నారు.

ప్రమాదంలో ఓ యువకుడు మిస్సింగ్‌

ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి హుస్సేన్‌సాగర్‌లో జరిగిన బోటు అగ్నిప్రమాదంలో అజేయ్‌ (21) అనే యువకుడు కనిపించకుండా పోయినట్లు సమాచారం. నాగారంకి చెందిన అజేయ్‌ ఆదివారం రాత్రి తన స్నేహితులతో కలసి హుస్సేన్‌సాగర్‌లో బోట్‌ విహారంలో ఉన్నాడు. అయితే అగ్నిప్రమాదం జరిగిన తరువాత అజేమ్‌ మిత్ర బృందం అందరూ క్షేమంగానే ఉన్నారు. కానీ అజేయ్‌ మాత్రం కనిపించకుండా పోయాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రిలో చకిత్స పొందుతున్న బాదితుల్లో అజేయ్‌ లేడని పోలీసులు కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే తమ కుమారుడు నిన్న ట్యాంక్‌బండ్‌ బోట్‌ అగ్ని ప్రమాదంలో కనపించకుండా పోయినట్లు అతని తల్లిదండ్రులు సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అజయ్‌కి ఈత రాదని అతని తల్లిదండ్రులు చెప్పడంతో ఒకవేళ ట్యాంక్‌బండ్‌లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com