దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. బాలీవుడ్ హీరోయిన్స్ హోలీ సందర్భంగా రంగుల పండుగను ఎంజాయ్ చేశారు. హోలీ వేడుకల్లో పాల్గొన్న కొందరు అందాల భామల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ముంబైలో స్నేహితులతో కలిసి హోలీ మిలన్ లో ఎంజాయ్ః చేసింది.
పశ్చిమబెంగాల్‌కు చెందిన అమికాశైల్ గాయని, నటిగా పాపులర్. ఉడాన్ ధారావాహికలో నటించి ఫేమ్ అయిన అమికా మంథన్, అభయ్, మిర్జాపూర్ తదితర వెబ్ సీరీసుల్లో నటించింది
బాలీవుడ్ హీరోయిన్ హీనా సోని ముంబైలోని తన అపార్ట్మెంట్ వాళ్లతో హోలీ సంబరాలు చేసుకుంది. హోలీ స్పెషల్ భంగ్ తాగుతూ ఫోటోలకు పోజులు ఇచ్చింది.
అందాల భామ హ్యూమా ఖురేషీ జుహులో తన బంధువులతో కలిసి హోలీ కేలీలో పాల్గొంది
టీ సీరీస్ అధినేత గుల్షన్ కుమార్ కుమార్తె ఖుషాలీ కుమార్…జుహులోని ఇస్కాన్ టెంపుల్లో హరే రామ హరే కృష్ణ అంటూ సంప్రదాయంగా జరుపుకున్నది
కృతి సనన్ తేరే ఇష్క్ మే’ పేరుతో లవ్‌స్టోరీ సినిమా చేస్తోంది. ధనుష్ తో కలిసి చేస్తున్న కృతి… షూటింగ్ విరామంలో హోలీ కేలీలో పాల్గొన్నది.
బెంగాలీ హీరోయిన్ మొనామి ఘోష్ స్పెషల్ గెటప్లో అదిరిపోయింది. డోల్ జాత్రా పేరుతో జరుపుకునే హోలీ వేడుకల్లో కలకత్తాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొంది.
ఇటీవల క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో ఇబ్బందులు పడ్డ ప్రముఖ గాయని నేహా కక్కర్ కుటుంబసభ్యులతో కలిసి వసంత పంచమి వేడుకలు జరుపుకుంది
మెగా ఫ్యామీలీకి చెందిన నటి నిహారికా కొణిదెల కుటుంబసభ్యులతో కలిసి రంగుల పండుగలో పాల్గొన్నది
మాజీఎంపి, బెంగాలి సినీ నటి నుస్రత్ జహా కలకత్తాలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొని…అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది
అలనాటి నటి రవీనా టాండన్ హోలీ సందర్భంగా తన నివాసానికి వచ్చిన అభిమానులకు బహుమతులు పంచి శుభాకాంక్షలు తెలిపింది
బాలీవుడ్ భామ రిద్దిమా పండిట్ కశ్మీర్ స్టైల్లో వేడుకలు జరుపుకుంది. హోలిక దహనంలో పాల్గొని అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది
పంజాబీ హీరోయిన్ షెహనాజ్ గిల్ అమృతసర్లో స్నేహితులతో కలిసి హొల్లా మోహల్లా వేడుకలు జరుపుకున్నది
మిర్జాపూర్ ఫేమ్ శ్రీయ పిగ్లోంకర్ హోలీ వేడుకలను లాఠీమార్ తరహాలో చేసుకుంది. లాఠీమార్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న మ్యూజిక్ అల్బమ్ షూటింగ్ ఫోటోలను షేర్ చేసింది.
బాలీవుడ్ లో ఆజాద్ సినిమాతో ఆరంగ్రేటం చేసిన రషా తడాని ఉయ్ అమ్మ పాటతో ఫేమ్ అయింది. నటి రవీనా టాండన్ గారాల పట్టి రషా హోలీ వేడుకల్లో మస్త్ మజా చేసింది