నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఓ ఎంపీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగా ఆ సమీపంలోనే అగ్నిప్రమాదం జరిగింది. అయితే, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.
రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపి మల్లు రవి నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన భూ భారతి సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్లో వెళ్లారు.అయితే, వాళ్లు వెళ్లిన హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో హెలిపాడ్ పక్కనే అగ్నప్రమాదం జరిగింది. దీంతో, అక్కడున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది.
అయితే, హెలికాఫ్టర్ ల్యాండ్ కోసం ఇచ్చిన సిగ్నల్ బుల్లెట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.