22 C
Hyderabad
Sunday, November 1, 2026

Live Video

spot_img

గుజరాత్‌ తీరంలో భారీగా మాదక ద్రవ్యాల పట్టివేత

  • ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్స్‌, గుజరాత్‌ ఏటీఎస్‌ ల సంయుక్త ఆపరేషన్‌
  • రూ.1800 కోట్ల విలువైన 300 కిలోల మాదక ద్రవ్యాల స్వాధీనం

ఇండియన్‌ కోస్ట్‌ గార్స్ గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. దాదాపు 1800 కోట్ల రూపాయల విలువైన 300 కిలోల మాదక ద్రవ్యాలను ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌ సముద్ర తీరానికి సమాపంలో ఉన్న అందర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ వెలుపల ఏప్రిల్‌ 12వ తేదీ రాత్రి గుజరాత్‌ ఏటీఎస్‌, కోస్ట్‌ గార్డులు సంయుక్తంగా దాడులు చేసి భారీ స్ధాయిలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో గుజరాత్‌ ఏటీఎస్‌, ఐసీజీలు అరేబియా సముద్రంలో ఈ ఆపరేషన్‌ నిర్వహించాయి. భారత్‌ భద్రతా దళాల దాడిని ముందుగానే గుర్తించిన డ్రగ్‌ స్మగ్లర్లు తమ షిప్‌ లో ఉన్న మాదక ద్రవ్యాలను సముద్రంలోకి పడవేసి వారు అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు రేఖను దాటి పారిపోయారు. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ నౌకను ముందుగానే స్మగ్లర్లు గుర్తించడంతో వారు అంతర్జాతీయ జలాల్లోకి పారిపోయారు. అయితే స్మగ్లర్లు తప్పించుకున్నప్పటికీ వారు సముద్రంలోకి విసిరేసిన మాదకద్రవ్యాలను ఇండియన్‌ కోస్ట్‌ గార్డులు స్వాధీనం చేసుకోగలిగారు. భరత దళాలు స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల బరువు 300 కిలోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ లో వీటి విలువ సుమారు 1800 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను తదుపరి దర్యాప్తు కోసం గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ కి అప్పగించారు. ఈ మాదకద్రవ్యాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి, మన దేశంలో వీటిని ఎవరు రిసీవ్‌ చేసుకుంటున్నారు, అంతర్జాతీయ డ్రగ్‌ మాఫీయా ప్రమేయం ఏమేరకు ఈ మాదకద్రవ్యాల రవాణాలో ఉందనే విషయాలపై గుజరాత్‌ ఏటీస్‌ వాచారణ చేపట్టనుంది. అంతర్జాతీయ సముద్ర మార్గాలకు గుజరాత్‌ దగ్గరగా ఉండటం వల్ల డ్రగ్‌ మాఫియా ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని పెద్దయెత్తున మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతోంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను పట్టుకోవడం ద్వారా భారత నిఘా వర్గాలతో పాటు ఇండియన్‌ కోస్ట్‌ గార్డులు, గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ లు తమ సత్తాను చాటి చెప్పాయి. ఈ ఆపరేషన్‌ను నార్కో-టెర్రరిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఒక కీలకమైన ఘట్టంగా అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com