24.8 C
Hyderabad
Monday, November 2, 2026

Live Video

spot_img

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

కుమారుడు పెద్ద ఆపద నుంచి బయటపడటంతో ఉప ముఖ్యమంత్రి సతీమణి కొణిదెల అన్నా లెజినోవా తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుని తలనీలాలు సమర్పించుకున్నారు. అన్నా లెజినోవా అన్య మతస్తురాలు కావడంతో తిరుమల చేరుకునన్న వెంటనే టీటీడీ నిబంధనల ప్రకారం స్వామివారి మీద విశ్వాసం ప్రకటిస్తూ డిక్లరేషన్ పై సంతకం చేశారు. అనంతరం శ్రీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకుని పద్మావతి కళ్యాణ కట్టలో వెంకటేశ్వరుడికి తల నీలాలు సమర్పించారు. కొద్ది రోజుల క్రితం సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. కుమారుడికి పెద్ద గండం తప్పినందుకు అన్నా లెజినోవా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకున్నారు. అనుకున్న ప్రకారం మొక్కులు తీర్చుకోవడానికి అన్నా లెజినోవా తిరుమలకు చేరుకున్నారు. ముందుగా టీటీడీ నిబంధనల ప్రకారం గాయిత్రీ సదనంలో అధికారుల సమక్షంలో స్వామివారిపై విశ్వాసం ప్రకటిస్తూ డిక్లరేషన్ పై సంతకం చేశారు. తరువాత వరాహస్వామిని దర్శించుకుని, పద్మావతి కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. సోమవారం వేకువ జామునే శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం టీటీడీ ఆలయ అర్చకులు అన్నా లెజినోవాకు రంగనాయకుని మండపంలో వేదాశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీవారి నిత్యాన్నదాన సత్రానికి అన్నా లెజినోవా 17లక్షల రూపాయల విరాళం సమర్పించి, తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com