36.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

EB-5 వీసాల కోసం పెరుగుతున్న డిమాండ్‌

  • పెట్టుబడులు పెట్టేందుకు ఎగబడుతున్న ఇండియన్లు
  • కనీసం ఒక మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి తప్పనిసరి
  • కనీసం పది మంది అమెరికన్లకు శాశ్వత ఉపాధి కలగాలి
  • ఇన్ని షరతులు పెట్టినా ఎగబడుతున్న ఇండియన్లు, చైనా
  • అందుకే అనర్హులైన వారిని వెనక్కు పంపేందుకు యత్నాలు
  • తాజా ఏప్రిల్2025 రిట్రాగ్రెషన్ వీసా బులెటిన్ విడుదల

అమెరికాలో ఈబి వీసా విధానంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపే క్రమంలో అమెరికా ఆ గడువును మరింత కఠినతరం చేసేసి ముందుకు జరిపేసింది. తాజా సమాచారం ప్రకారం 2019 నాటికి ఇమ్మిగ్రెంటకు బదులు 2014 నుంచే అనర్హులైన ఇమ్మిగ్రంట్లను గుర్తించి వెనక్కు పంపుతారు.యూఎస్‌ వీసా బులెటిన్ ఏప్రిల్‌ షెడ్యూల్ విడుదలైంది.అమెరికాలో ఉన్న అక్రమ వలస దారులందరినీ గుర్తించి వారి వివరాలతో కూడిన బులెటిన్ విడుదల చేశారు. అందులో ఉన్నవారంతా వెనక్కు వచ్చేందుకు దరఖాస్తులు పెట్టుకోవాల్సి ఉంటుంది.వెనక్కు వెళ్లాల్సిన వారంతా ఒక చోట జమ అయి నేషనల్‌ వీసా సెంటర్ కు తమ వివరాలను సమర్పిస్తూ దరఖాస్తులు పెట్టుకోవాలి.2025 ఆర్థిక సంవత్సరానికి అనుమతించబడిన పరిమితి మేరకు అక్కడ ఉండే వారిని ఎంపిక చేసుకునేందుకు మిగిలిన ఇమ్మిగ్రంట్లను వెనక్కు పంపాల్సిఉంటుంది. ఈబీ -5 వీసాకు ఉన్న డిమాండ్‌ భారత, చైనా ఇమ్మిగ్రంట్లు అనేక మంది అనేక అన్ రిజర్వుడు కేటగిరీలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఈ ప్రోసెస్ జరుగుతోంది. మిగిలిన కోటాను ప్రపంచ వ్యాప్తంగా ఇతర ఇమ్మిగ్రంట్లకు వినియోగిస్తారు.

EB-5 వీసా ప్రోగ్రాం అంటే…

EB-5 వీసా ప్రోగ్రాంలో విదేశీ ఇన్వెస్టర్లు ఎవరైనా అమెరికాలో శాశ్వత నివాస హక్కును కావాలనుకుంటే కనీసం ఒక మిలియన్ అమెరికన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో 8 కోట్ల 71 లక్షల57 వేలు) పెట్టుబడి పెట్టగలిగి ఉండాలి. అక్కడ అనేక ఉపాధి అవకాశాలున్న రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టడం వల్ల కనీసం పది మంది అమెరికన్ల కి ఫుల్‌ టైమ్‌ ఉద్యోగాలు కల్పించగలిగి ఉండాలి.ఈ వీసా విధానంపై ఇండియన్లు, చైనీయ పెట్టుబడి దారులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.

2025 ఏప్రిల్‌ వెనక్కుపంపాల్సిన వారి వివరాల బులెటిన్

2025 వీసా బులెటిన్ లో EB-5-5 వీసా విధానంలో అన్ రిజర్వుడు వీసా కేటగిరీలో భారత, చైనాలకు చెందిన అనేక మందిని వెనక్కు పంపాల్సిందేనని తేలింది.భారత్‌కు చెందిన ఇమ్మిగ్రంట్లను వెనక్కు తరలింపు ప్రకియను రెండేళ్లు వెనక్కు జరపడం వల్ల 2019 నవంబర్ ఒకటి అని ప్రకటించగా, చైనాకు రెండున్నర ఏళ్లకు మించే అంటే 2014 జనవరి 22 నాటి నుంచి ఉన్న వారందరినీ పంపేయాల్సి ఉంది. అంటే ఈ రెండు దేశాలకు చెందిన దరఖాస్తుదారుల వీసాలను ముందు పరిశీలించి (రిట్రాగ్రెషన్) అంటే వెనక్కు పంపాల్సిన లిస్టు ఓకే చేయాల్సి ఉంది. ఈ రెండు దేశాలకు చెందిన దరఖాస్తుదారులు ఈ EB-5 వీసాల కోసం పోటీ పడుతున్నందున వీరి వ్యవహారమే ముందు తేల్చాల్సిన అవసరముంది. రెండు దేశాలకు చెందిన వీసాలను ప్రతీ ఏడు పరిశీలించాల్సి ఉండగా కుప్పల కుప్పల దరఖాస్తులు పెండింగ్‌ ఉన్నందున రిట్రాగ్రెషన్‌ తేదీలను వెనక్కుజరిపి మాగ్జిమమ్ మందిని వెనక్కు పంపేస్తున్నారు. మరోవైపు EB-5 కేటగిరీలో బాక్ లాగ్‌ కోటాకు ప్రపంచ దేశాలనుంచి విపరీతమైన డిమాండ్‌ కనిపిస్తోంది.
EB-5 కోటాలో గ్రీన్ కార్డులు దక్కించుకోవాలంటే ఇండియన్లు రిట్రాగ్రేషన్ తర్వాత చాలా ఎక్కువకాలం వేచి చూడాల్సిన పరిస్థితి.2019 నవంబర్ 1 తర్వాత ఈ వీసా దరఖాస్తు చేసుకోవడం లో ఆలస్యం వల్ల వారి పెట్టుబడి ప్లానులన్నీ తల్లకిందులవుతున్నాయి.అందుకే పెట్టుబడులు పెట్టగలిగి అక్కడ స్థిర నివాసం కోరుకుంటున్న వారు ఇతర వీసా ఛాయిస్ ల ద్వారా ప్రయత్నించడమొక్కటే మార్గం. ఈ డిమాండ్‌ మరింత పెరిగితే భారత, చైనా దేశాలే కాదు ప్రపంచ దేశాల దరఖాస్తు దారుల దరఖాస్తులను కూడా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవడానికి ఒక తేదీని ప్రకటించాల్సి ఉంటుంది. EB-5 వీసా కోసం పెట్టుబడిదారుల సంఖ్యపెరుగుతున్న నేపధ్యంలో ఈ వీసాబులెటిన్ లు సకాలంలో ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సిఉంది.
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని కఠినతరం చేసేసినా ఇంకా EB-5 వీసా విధానం ద్వారా నైనా అక్కడ శాశ్వత నివాసం కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అంత భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధపడుతున్నందున ఈ డిమాండ్‌ ను అమెరికా క్యాష్‌ చేసుకుంటోంది.సంక్లిష్టంగా, కఠినంగా మారిన ఈ వీసా విధానం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com