37.2 C
Hyderabad
Thursday, May 14, 2026

Live Video

spot_img

గబ్బా టెస్ట్ డ్రా.. ఇండియా పరువు కాపాడిన వరణుడు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రా ముగిసింది. నిజానికి ఈ మ్యాచ్‌లో దారుణ ఓటమిని తప్పించింది ఇద్దరు బౌలర్లు, వర్షం అనే చెప్పాలి. లేదంటే ఆసీస్‌ చేతిలో మరింత పరువు పోయేది టీమ్ ఇండియాది. ఆట అన్నాక గెలుపోటములు సహజమే కానీ.. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్‌ ఫైనల్స్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీమ్ ఇండియాకు ప్రతి మ్యాచ్‌ ముఖ్యమైనదే. అందుకే ఓటమి కంటే డ్రా చాలా మేలు. ఐదో రోజు వర్షం కారణంగా పెద్దగా ఆట జరగకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియా భారత్‌కు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రతిస్పందనగా టీమ్ ఇండియా వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్రిస్బేన్‌లో భారీ వర్షం కురవగా, ప్రతికూల వాతావరణం కారణంగా మ్యాచ్ డ్రా అయింది. ప్రస్తుతం టెస్టు సిరీస్‌ 1-1తో సమంగా ఇరుజట్లు నిలిచాయి. తరువాతి మ్యాచ్‌ డిసెంబర్‌ 26 నుంచి మెల్‌బోర్న్‌లో జరగనుంది.

మొదటి మూడు రోజులు ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శించింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ నాలుగో రోజు, ఐదో రోజు టీమ్ ఇండియా అదరగొట్టిందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ లో 445 ప‌రుగులు చేసిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో 89/7 వ‌ద్ద డిక్లేర్ చేసింది. దీంతో మొద‌టి ఇన్నింగ్స్‌లో 185 ప‌రుగుల ఆధిక్యాన్ని క‌లుపుకొని టీమిండియాకు 275 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ఇక భార‌త జ‌ట్టు త‌న మొద‌టి ఇన్నింగ్స్‌లో 260 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. టీమిండియా ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకోవడం ఓ హైలేట్ అనే చెప్పాలి.

నిజానికి టీమిండియాకు కేవలం 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గత పర్యటనలో ఆస్ట్రేలియాపై ఇదే మైదానంలో 328 పరుగుల స్కోరును చేజ్ చేసి ఓ రికార్డును సృష్టించింది టీమిండియా. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా ఈ స్కోరును ఛేదించడం సాధ్యమనిపించింది. కానీ వాతావరణం అనుకూలిస్తుందా? లేదా? అనే సందేహాలు ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ వరణుడు ఎంట్రీ ఇవ్వడంతో మ్యాచ్‌ డ్రా ముగిసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com