మాజా మంత్రి, ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. ఆయనతో పాటు అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి కూడా వెఎస్సార్సీపీలో చేరారు. వీరిద్దరికీ వైఎస్.జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ రాజకీయ విధానాలు నచ్చడం వల్లే వైఎస్సార్సీపీలో చేరనని చెప్పారు. ప్రజల తరపున వైఎస్సార్సీపీ పోరాడుతోందని, వైఎస్‌జగన్ నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్దంగా ఉన్నానని శైలజానాథ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందన్న శైలజానాథ్ ఎన్నికల ముందు కూటమి పార్టీలు ప్రజలకి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని శైలజానాథ్ విమర్శించారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాలంలో వారి ముగ్గురి క్యాబినేట్‌లో శైలజానాథ్ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన శైలజానాథ్ తాజా తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
- Advertisement with us -