33.9 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

ఒంగోలు పోలీసుల ముందు విచారణకు హాజరైన ఆర్జీవీ

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎట్టకేలకు ఒంగోలు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. వ్యూహం సినిమా విడుదల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్షనేత అయిన నారా చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ల ఫోటోలతో సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకర కామెంట్లు పెట్టి ప్రచారం చేశారని టీడీపీ నాయకులు పలు పోలీస్‌స్టేషన్లలో రామ్‌గోపాల్‌వర్మపై కేసులు పెట్టారు. ఈ కేసులపై ఒంగోలు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌తో పాటు మద్దిపాడుపోలీస్‌ స్టేషన్లకు చెందిన సిబ్బంది విచారణకు హాజరు కావాలని రామ్‌గోపాల్‌ వర్మకు గడచిన రెండు నెలల్లో మూడు, నాలుగు సార్లు నోటీసులు జారీ చేశారు. మొదటిసారి స్వయంగా హైదరాబాద్‌ లోని ఆర్జీవీడెన్‌కి వచ్చి నోటీసులు ఇవ్వగా తనకు ముందుగా ప్లాన్‌ చేసుకున్న షూటింగ్‌లు ఉన్నాయని చెప్పి విచారణకు హాజరుకాలేదు. ఆ తరువాత కూడా ఒకట్రెండు సార్లు నోటీసులు ఇచ్చినా ఆర్జీవీ షూటింగ్‌ల్లో బిజీగా ఉండి వెళ్ళలేకపోయారు. తాజాగా మరో నోటీసును ఒంగోలు రూరల్‌ పోలీసులు వాట్సప్‌ ద్వారా రామ్‌ గోపాల్‌వర్మకి నోటీసుల పంపారు. దానికి స్పందించిన ఆర్జీవీ శుక్రవారం ఒంగోలు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఆర్జీవీతో పాటు వైఎస్‌ఆర్సీపీ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అన్నా రాంబాబులు కూడా ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com