34.5 C
Hyderabad
Friday, October 30, 2026

Live Video

spot_img

కూటమి సర్కారుపై మాజీ మంత్రి ఆదిమూలపు నిప్పులు

ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నడుస్తానని మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. సింగరాయకొండ వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలను పక్కన పెట్టి ప్రతిపక్ష నేతలపై తప్పుడు ప్రచారాలు సృష్టించడం సరికాదన్నారు. జగన్ సహచరునిగా ఉండడం తన అదృష్టమని ఆయన అన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తోందని, నయవంచనకు పాల్పడుతోందని మాజీ మంత్రి సురేష్ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను నమ్మించి వాళ్లలో ఎన్నో ఆశలు నింపిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత యువకులు, మహిళలు, రైతులకు మొండిచేయి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల ప్రభుత్వం తరపున దావోస్‌కు వెళ్లిన లోకేష్‌ వట్టిచేతులతో తిరిగొచ్చి మాయ మాటలు చెబుతున్నాడని, దావోస్‌లో ఒప్పందాలు జరగవని లోకేష్ అంటున్నాడని విమర్శించారు. అక్కడ కేవలం చర్చలు మాత్రమే జరుగుతాయంటున్న లోకేష్‌.. పక్క రాష్ట్రం ఏం చేసిందో తెలుసుకోవాలన్నారు. తెలంగాణ నుంచి వెళ్లిన ప్రతినిధి బృందం.. దావోస్‌లో ఒక లక్షా 80వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని ప్రకటించారని, మరి.. అవి ఒప్పందాలు కావా? అని లోకేష్‌ను ప్రశ్నించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు దాటవేయాలని అధికారంలోకి వచ్చినప్పటినుంచీ సన్నాయినొక్కులు నొక్కుతున్నారని.. ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వానికి కేవలం ఐదు సంవత్సరాలు పాలించేందుకు మాత్రమే అవకాశం ఇచ్చారని, కానీ, ఇప్పుడేం చేస్తారో చెప్పకుండా.. 2047లో ఏం చేస్తామో చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అప్పటి విషయం పక్కనబెట్టి.. ఇప్పుడు ఐదేళ్ల గడువులోగా ఏం చేస్తారో చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా వెంటపడతామని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ హెచ్చరించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com