31.8 C
Hyderabad
Monday, June 15, 2026

Live Video

spot_img

కాంగ్రెస్‌లో వర్గీకరణ లొల్లి…

  • కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ
  • వర్గీకరణ పై రెండు గ్రూపులుగా విడిపోయిన నాయకులు.
  • వర్గీకరణను వ్యతిరేకించిన గడ్డం వివేక్.
  • వివేక్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సంపత్.
  • అధిష్టానం వద్దకు చేరిన పంచాయతీ

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కొందరు నేతలు చేస్తున్న కామెంట్స్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. వర్గీకరణ విషయంలో మాలలు, మాదిగలు రెండు గ్రూపులుగా విడిపోయి కామెంట్స్ చేయడం పై అధిష్టానం కూడా సీరియస్ అయినట్లుగా తెలిసింది. సున్నితమైన అంశంపై బహిరంగంగా కామెంట్స్ చేయవద్దని డైరెక్షన్స్ ఇచ్చినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇక అసలు విషయానికి వస్తే వర్గీకరణ విషయంలో తొందరపాటు సరైంది కాదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ చేసిన కామెంట్స్ సంచలనగా మారుతున్నాయి. వర్గీకరణ పేరిట మాలలకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. మాలల విషయంలో తాను ముందుండి పోరాడతానని ఆయన చేసిన కామెంట్స్ కాంగ్రెస్‌లో ఉన్న మాదిగ నాయకులు సీరియస్ గా తీసుకుంటున్నారు.

సి డబ్ల్యూ సి మెంబర్ సంపత్ కుమార్ ఏకంగా వివేక్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ వర్గీకరణకు జాతీయస్థాయిలో మద్దతు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ ఈ అంశంపై వివేక్ కామెంట్స్ సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై ఇలాంటి కామెంట్స్ చేస్తే సహించమని ఆయన హెచ్చరించారు కూడా. పార్టీ అధిష్టానం కూడా దీనిపై యాక్షన్ తీసుకోవాలని ముఖ్యంగా వివేక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూడాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో వర్గీకరణ వివాదం అన్ని స్థాయిల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మాలాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వర్గీకరణ విషయంలో జిల్లా స్థాయిలో సమావేశాలు పెట్టుకుని వర్గాకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అదే సమయంలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా వర్గీకరణను సమర్థిస్తూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు.. రెండు వర్గాలుగా నాయకులు విడిపోవడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com