కరప్షన్‌కి కజిన్ జగన్‌మోహన్‌రెడ్డి అని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ లక్ష కోట్లు కొల్లగొట్టారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అంతేకాదు.. గత ఐదేళ్లలో జగన్‌తో సహా వైసీపీ నేతలు అందరూ కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లుగా దోపిడీలు చేశారన్నారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారని చెప్పారు. వైసీపీ నేతలు చేసిన అవినీతిని బయటపెడతామన్నారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండబోవన్నారు. అయితే, అవినీతికి పాల్పడిన వాళ్లందరికీ శిక్ష తప్పదని హెచ్చరించారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవని స్పష్టం చేశారు. అలాంటివి ఉంటే ఇప్పటికే మొదలు కావాల్సింది కదా.. అని ప్రశ్నించారు. ఏ అంశంలో అయినా దోషులుగా తేలిన తర్వాతే నిందితులపై చర్యలు తీసుకుంటున్నామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు. తనతో వైసీపీ నేతలెవరూ టచ్‌లో లేరని మంత్రి డోలా క్లారిటీ ఇచ్చారు.
- Advertisement with us -