25.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

అమెరికాలో కార్చిచ్చు.. మళ్లీ మొదలు

లాస్ ఏంజిల్స్‌ను కార్చిచ్చు వదలడం లేదు. ఇప్పటికే లాస్‌ ఏంజిల్స్‌లోని పలు ప్రాంతాలను మొత్తం దహించి వేసిన ఈ కార్చిచ్చు ఇప్పుడు కొత్త ప్రాంతంలో మొదలైంది. కాస్టాయిక్ లేక్ ఏరియాలో అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. చూస్తుండగానే ఈ మంటలు 9,200 ఎకరాలకు విస్తరించాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రీసెంట్‌ గా ఈ రాష్ట్రంలోని ఈటన్, పాలిసేడ్స్‌లో ఇంకా మంటలు పూర్తిగా ఆరలేదు. ఇంతలోనే కొత్త ప్రాంతంలో మంటలు చెలరేగడం ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలను టెన్షన్ పెడుతోంది. పాలిసేడ్స్‌కు 64 కిలోమీటర్ల దూరం ఉంటుంది ప్రస్తుతం మంటలు చెలరేగిన ప్రాంతం.

ప్రస్తుతం ఈ మంటలను ఆర్పడం కష్టంగా మారిందంటున్నారు అధికారులు. మంట తీవ్రత ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే.. వేగంగా వీస్తున్న పొడి గాలులు రెస్క్యూ ఆపరేషన్స్‌కు ఆటంకంగా మారింది. గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశమే ఉంది కానీ.. తగ్గే అవకాశం లేదంటున్నారు వాతావరణశాఖ అధికారులు. దీన్ని బట్టి చూస్తే మంటలను చూస్తూ ఉండటం తప్ప చేసేదేం లేదనే చెప్పాలి. దీంతో ఆ ప్రాంతంలోని 50 వేల మంది వరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో 31,000 వేల మంది ఉన్నపలంగా తమ ఇళ్లను వదిలి వెళ్లాలని చెప్పగా.. మరో 23,000 మంది మాత్రం తమ ఇళ్లను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు తెలిపారు.

గత కొన్ని రోజులుగా ఫైర్ ఫైటర్స్ ఈ మంటలను ఆర్పేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వాళ్లు మంటలను కట్టడి చేయడంలో సక్సెస్ అవుతున్న సమయంలోనే మరో కార్చిచ్చు మొదలవడంతో ఇప్పుడు కథ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం కార్చిచ్చు వల్ల కూడా చాలా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com