బోణి అదిరిపోయింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల టీ20 సిరీస్‌లో ఆరంభం అదుర్స్ అనిపించారు టీమిండియా యువ టీమ్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ సాధించారు. అభిషేక్ శర్మ అయితే పరుగుల వరద పారించేశాడు. ఇంగ్లీష్ బౌలర్లపై సిక్సులతో చెలరేగడంతో తొలి టీ20లో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
హాఫ్ సెంచరీతో అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. 34 బంతుల్లో 79 స్కోర్ చేశాడు. అంతకుముందు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ శాంసన్ కూడా అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్లో ఒక్క పరుగే చేసిన ఓపెనర్ శాంసన్.. అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్లో మాత్రం 4, 4, 6, 4, 4 తో ఏకంగా 22 పరుగులు చేశాడు. ఆర్చర్ మూడో ఓవర్లో అభిషేక్ 4,6 బాదాడు. అయితే అతడే వేసిన 5వ ఓవర్లో మూడు బంతుల వ్యవధిలోనే శాంసన్, సూర్యకుమార్ నిష్క్రమించారు. 26 రన్స్ చేసి ఆర్చర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు శాంసన్. ఆ తర్వాత అభిషేక్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్స్‌లు బాదాడు అభిషేక్. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసిన అతడు ఆ తర్వాత మరింత జోరు పెంచాడు. ఆఖర్లో అతడు ఔట్ అయినా తిలక్ వర్మ లాంఛనాన్ని పూర్తిచేశాడు.
ఇంగ్లీష్ టీమ్‌ను చూసుకుంటే బట్లర్ తప్ప మరెవ్వరూ ఆడలేదు. సాల్ట్, డకెట్, హ్యరీ బ్రూక్ ఎవ్వరూ తమ స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ చేయలేదు. సంచలనాలు నమోదు చేస్తాడునుకున్న బెతెల్ కేవలం 7 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. హార్ధిక్ పాండ్యా చేతిలో ఔట్ అయ్యాడు. అర్షదీప్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లతో చెలరేగారు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో 1-0 భారత్ ఆధిక్యంలో ఉంది.
ఈ మ్యాచ్‌లో తీసిన వికెట్స్‌తో టీ20లలో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. అర్ష్‌దీప్ భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మ్యాచ్‌లో బెన్ డకెట్ వికెట్ అతడి టీ20 కెరీర్‌లో 97వది. ఇంతకు ముందు 96 వికెట్లతో యుజ్వేంద్ర చాహల్ పేరుపై ఉండేది. చాహల్ 80 ఇన్నింగ్స్‌లలో 96 వికెట్లు సాధిస్తే.. అర్ష్‌దీప్ 61 ఇన్నింగ్స్‌లోనే 97 వికెట్లు తన అకౌంట్‌లో వేసుకున్నాడు.