24 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

స్టార్‌ హోటల్లో మంటలు… ఖళీ చేసి వెళ్లిపోయిన సన్‌ రైజర్స్‌

బంజారాహిల్స్‌లో ఉన్న ప్రఖ్యాత స్టార్‌ హోటల్‌ పార్క్‌ హయత్‌ లో అగ్ని ప్రమాదం సంభవించింది. హోటల్‌ మొదటి అంతస్తులో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. మంటలు భారీగా వ్యాపించడంతో హోటల్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైర్‌ సిబ్బంది సమాచారం అందించారు. సోమవారం ఉదయం సమయంలో పార్క్‌ హయత్‌ హోటల్‌ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించి దట్టమైన పొగలు హోటల్‌ ఆవరణ అంతా అలుముకున్నాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంనటే హోటల్‌ కి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఇదే హోటల్లో ఐపీఎల్‌ – 2025 ఆడటానికి వచ్చిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ బస చేయడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కానీ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ టీమ్‌ సభ్యులకు ఎటువంటి ప్రమాదం వాటిల్ల లేదని, వారంతా సురక్షితంగా ఉన్నారని హోటల్‌ సిబ్బంది తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చిన వెంటనే సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ మొత్తం రెండు బస్సుల్లో హోటల్‌ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది. మంటలు ఎందుకు అంటుకున్నాయి అన్న వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com