28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాడండి

  • బీఆర్ఎస్ సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం
  • బీఆర్ఎస్ శాసనసభా పక్షంతో కేసీఆర్ భేటీ
  • ఆదివారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగిన సమావేశం

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో బలంగా వాణిని వినిపించాలని బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ శాసనసభ్యులకు దిశానిర్దేశం చేశారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాకు తెలిపారు. ఆదివారం గజ్వల్ సమీపంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ శాసనసభా పక్షం సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. అనంతరం కేటీఆర్ మీడియాకు సమావేశా వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ బీఆర్ఎస్ శాసనసభ్యులు, మండలి సభ్యులకు మార్గనిర్దశం చేశారని తెలిపారు.

దుర్భర పరిస్ధితుల్లో వ్యవసాయం

రాష్ట్రంలో వ్యవసాయ రంగం దుర్భర పరిస్ధితిలో ఉందని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని, రుణమాఫీ అరకొరగా చేశారని, ఇప్పటి వరకూ రైతు భరోసా ఇవ్వలేదని,  ఏం సాధించారిన వియోత్సవాలు చేసుకుంటున్నారని ఇది రైతులను అవమానించడమే అని కేటీఆర్ అన్నారు. రైతుల గొంతుకగా అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ చెప్పారు.

అధ్వాన్న స్ధితిలో గురుకులాలు

గురుకుల బాట పేరుతో ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని కమిటి రాష్ట్రంలో అన్ని గురుకుల పాశాలలను పరిశీలించి అక్కడ నెలకొన్న అధ్వన్న పరిస్ధితులపై కేసీఆర్ కు నివేదిక ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. గురుకులాలు సంస్కారవంతంగా నడిపేలా ప్రభుత్వం ఒత్తిడి తేవాలని, ఆక్కడి పరిస్ధితులు కళ్ళకు కట్టినట్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలని శాసనసభ్యులను ఆదేశించినట్లు కేటీఆర్ చెప్పారు.

అధికారపార్టీ దౌర్జన్యకాండ

రాష్ట్రంలో దౌర్జన్యకాండ జరుగుతోందని కొడంగల్, సంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో దళిత, గిరిజన రైతులపై ప్రభుత్వం దాడులు చేస్తోందని, కేసులు పెట్టి, నిర్బంధించి రైతుల భూములు లాక్కుంటోందని ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఫార్మాసిటీ ఉంటుందని హైకోర్టుకు చెప్పారని ఆయన నిలదీశారు. దళిత, గిరిజన, చిన్న, సన్నకారు రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందిని ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఎక్కడికక్కడ హక్కుల ఉల్లంఘన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని సర్కారు అరాచకాలపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు.

తెలంగాణ తల్లి మార్పు అస్ధిత్వంపై దాడే

కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమం, చరిత్రపై అవగాహన లేదని తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చి అస్థిత్వంపై దాడి చేస్తున్నారుని కేటీఆర్ మండిపడ్డారు. మూర్ఖంగా, అనాలోచితంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని ప్రభుత్వం చేసిన ఈ దుర్మార్గమైన పనిని అసెంబ్లీ, మండలిలో నిలదీస్తామన్నారు.

సంక్షోభంలో పంచాయితీలు

గ్రామ పంచాయతీల్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి కనీసం పిచికారీ మందులకు కూడా పైసల్లేవు తాజా మాజీ సర్పంచులకు బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు, సెక్రటరీలకు డబ్బులు ఇచ్చే వాళ్లు లేరని విమర్శించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లెలను బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుచేసి తెలంగాణ గ్రామాలను దేశానికే ఆదర్శంగా నిలిపామని కేటీఆర్ వివరించారు. ప్రస్తుత ప్రభుత్వంలో పల్లెల దీన స్థితిపై అసెంబ్లీలో నిలదీస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com