అక్కడొక ఫ్యాషన్ షో జరుగుతోంది… సభా మద్యమున మోడల్స్ క్యాట్ వాక్ చెయ్యడానికి ఒక ర్యాంప్ ఏర్పాటు చేశారు… ఫ్యాషన్ జగత్తుకు చెందిన అనేక మంది మోడల్స్ ర్యాంప్ పై వయ్యారంగా నడుస్తూ ఆహుతులను అలరిస్తున్నారు.. ఇంతలో అకస్మాత్తుగా ఇద్దరు కేంద్ర మంత్రులు ర్యాంప్ పైకి వచ్చి క్యాట్ వాక్ చేసి సభికులను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తారు. న్యూఢిల్లీ వేదికగా శనివారం రాత్రి జరిగిన ఈ ఇద్దరు కేంద్ర మంత్రుల ర్యాంప్ వాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ ఛల్ చేస్తోంది. న్యూఢిల్లీలో అష్టలక్ష్మీ మహోత్సవ్ ఫ్యాషన్ షోలో కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, సుకాంత మజుందార్ లు ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టారు. ఇద్దరు మంత్రులు ఈశాన్య ప్రాంత సంస్కృతీ, సాంప్రదాయలను ప్రతిబింబించేలా జాకెట్లు ధరించి ర్యాంప్ పై క్యాట్ వాక్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల వస్త్ర ధారణలను, అలంకరణలను ప్రోత్సమించడానికే కేంద్ర మంత్రులిద్దరూ ర్యాంప్ వాక్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.