24.3 C
Hyderabad
Wednesday, July 29, 2026

Live Video

spot_img

ఫ్యాన్సీ నెంబర్లా.. మజాకా!

  • ఒకే నెంబర్‌కు రూ.9.9 లక్షలు

  • మరో నెంబర్‌కు రూ.7.5 లక్షలు

  • ఒక్కరోజు ఫ్యాన్సీ నెంబర్ల ఆదాయం రూ.37.3 లక్షలు

ఫ్యాన్సీ నెంబర్లపై రోజు రోజుకూ మోజు పెరిగిపోతోంది. వాహనాలు కొనుగోలు ఒక లెక్క.. నచ్చిన నెంబర్‌ సొంతం చేసుకోవడం ఇంకో లెక్క అన్నట్లుగా ఉంది కొందరు సంపన్న వాహన యజమానుల తీరు. అందుకే దాదాపు మరో వాహనం కొనేంత డబ్బు.. కేవలం ఫ్యాన్సీ నెంబర్ల కోసం పెడుతున్నారు. ఇలా రంగారెడ్డి జిల్లాలో ఒకేరోజు ఆర్‌టీఏ అకౌంట్‌లో 37 లక్షల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది.

సాధారణంగా ఫిలిం స్టార్లు, డబ్బున్న బడా వ్యాపారులు, పెద్ద పెద్ద కంపెనీల యజమానులు ఫ్యాన్సీ నెంబర్లను ఇష్టపడటం మనం చూస్తుంటాం. అయితే, ఇప్పుడు ఫ్యాన్సీ నెంబర్ల కోసం మధ్య తరగతి ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు ఉంటే రీ సేల్‌లో కూడా మంచి ధర వస్తుందన్న ఆలోచన కూడా దీనికి కారణమంటున్నారు.

మణికొండలోని రంగారెడ్డి జిల్లా ఆర్టిఏ కార్యాలయానికి ఒక్కరోజులోనే 37 లక్షల 29,690 రూపాయల ఆదాయం వచ్చింది. అది కూడా కేవలం ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా సమకూరింది. స్వతహాగా ఫ్యాన్సీ నెంబర్ల కోసం జనం ఎగబడుతూ ఉంటారు. సెంటిమెంట్, జాతకరీత్యా, పేరు బలంతో, సంఖ్యాబలంతో తమ వాహనాలకు నెంబర్ ప్లేట్లు తమకు కావాల్సిన సిరీస్‌లో తీసుకోవడం సాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే, ఆ నెంబర్లు ఫ్యాన్సీగా ఉంటే వాటికి అత్యధిక డిమాండ్ ఉంటుంది. కేవలం వాహనాలకే కాదు.. మొబైల్ నెంబర్లలో కూడా ఫాన్సీ నెంబర్ల కోసం ఎక్కువ డబ్బు చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. అయితే, మణికొండ లో ఉన్న రంగారెడ్డి జిల్లా ఆర్టిఏ ఆఫీస్‌ అకౌంట్‌కు ఒకే రోజు నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలంపాటలో ఇంతగా ధనం వచ్చి పడింది. అయితే అందులో దాదాపు 30శాతం డబ్బులు ఒకే ఒక్క నెంబర్‌కు సమకూరడం రికార్డు సృష్టించింది. టీజీ 07 పి 9999 రిజిస్ట్రేషన్ నెంబర్‌కు అత్యధిక ధరకు పలికింది.

టీజీ 07 పి 9999 నెంబర్‌ని ముష్ప ప్రాజెక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన వేలం పాటలో భారీగా డబ్బులు చెల్లించి మరీ ఈ నెంబర్‌ను కొనుగోలు చేసింది. వేలంలో పాల్గొన్న ఈ సంస్థ ఆ నెంబర్‌కి ఏకంగా 9,86,999 రూపాయలను వేలంలో పాడి సొంతం చేసుకుంది. ఆ తర్వాత క్రమంలో టీజీ 07 ఆర్ 0009 అనే నెంబర్‌ని కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ అనే సంస్థ 7.50 లక్షల రూపాయలకు వేలంపాటలో దక్కించుకుంది. ఇది మాత్రమే కాదు.. మొత్తం మణికొండలో ఒక్కరోజే 106 మంది ఫాన్సీ నెంబర్ల వేలం పాటలో పాల్గొన్నారు. ఈ ఫాన్సీ నెంబర్‌లు కొంతమందికి సెంటిమెంట్ అయితే.. మరి కొంత మంది హోదా కోసం కూడా కొనుగోలు చేస్తుంటారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com