33.2 C
Hyderabad
Friday, May 1, 2026

Live Video

spot_img

సంభాల్ లో తవ్వకాల వివాదం

  • యోగీ ఇంటి కింద శివలింగం ఉంది : అఖిలేష్
  • అప్పట్లో బంగారం తవ్వారు మరి.. బీజేపి దెప్పి పొడుపు

లక్నో లో సీఎం యోగీ ఆదిత్య నాథ్ అధికారిక నివాసం కింద పురాతన శిలింగముంది. దానిని తవ్వి తీయాలంటున్నారు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ సింగ్ యాదవ్. యూపీలో వేర్వేరు చోట్ల పురాతన తవ్వకాలు చేపడుతుండటంపట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూపీ కోర్టు గత నెలలో మొఘలుల కాలంనాటి మసీదు కింద మందిరం ఉందని, దానిని తవ్వి తీయాలని ఆదేశాలివ్వడం సంభాల్ లో ఘర్షణలకు దారి తీసింది. అక్కడి తవ్వకాల్లో తాజాగా పురాతన దిగుడు బావి బయటపడింది. సంభాల్ ఉద్రిక్తతల నేపధ్యంలో అఖిలేష్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చు కోడానికి ఇష్టాను సారం ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు సాగిస్తోందన్నారు.యోగీ ఆదిత్య నాథ్ ఇంటి కింద కూడా పురాతన శివలింగం ఉందని మా నమ్మకం.దానిని తవ్వి వెలికి తీయాలి అని డిమాండ్ చేస్తున్నారాయన. తవ్వ కాల పేరు చెప్పి ఈ అమాయకుల ఇళ్లను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నారని మండి పడ్డారు.సీఎం ది ఒకటే పంథా అది అభివ్రుద్ధి పథం కాదు.. విధ్వంస పథం అని ఎద్దేవా చేశారు. దీనికి బీజేపి నేతలు ఘాటు కౌంటర్ ఇచ్చారు. వెయ్యి టన్నుల బంగారం తవ్వకాలు జరుపుతున్నారు.అందుకే వారికి శివలింగం అడ్డొచ్చింది.. అందుకే సీఎం ఇంటిని తవ్వాలంటున్నారు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

అఖిలేష్ హయాంలో గుప్త నిధుల వేట

2013లో అఖిలేష్ సింగ్ సీఎంగా ఉన్నప్పుడు యూపీలో ఓ ప్రాంతంలో వెయ్యి టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయన్న కొందరి మాటలను నమ్మి అప్పటి ప్రభుత్వం తవ్వకాలు చేపట్టింది. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. కానీ అలాంటివేం బయటపడలేదు.

సంభాల్ లోని కాట్ పుర్విలో తవ్వకాలలో మృత్యుకూపంలా పేరుపడిన ఓ పురాతన దిగుడు బావి బయటపడింది. పాతకాలం నాటి పురాతన బావి చెత్తా, చెదారంతో పూడుకు పోయింది. అయితే ఆ బావి చాలా పురాతనమైనదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయని, అందులో ఉన్న నీళ్లు కూడా చాలా పవిత్రమైనవని అనేక రోగాలను నయం చేసేవని స్థానికులు చెబుతున్నారు. మొఘలుల కాలంనాటి షాహీ జమా మసీదు కు సమీపంలో హరిహర ఆలయం ఉండేందన్న ఓ పిటిషన్ నేపధ్యంలో స్థానిక కోర్టు అప్పట్లో తవ్వకాలకు ఆదేశించింది. అది ఘర్షణలకు దారి తీసి నలుగురు చనిపోయారు కూడా. ఉద్రిక్తతల నేపధ్యంలో ఇప్పటికీ సంభాల్ లో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com