టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. తిరుపతిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టిడిపి నేతలు తనను గోశాలకు రావాలని సవాల్ విసిరిన వెంటనే, తాను సిద్ధమని ప్రకటించానన్నారు. కానీ, వెంటనే తనను, తన అనుచరులను హౌస్ అరెస్ట్ చేసి, ఇంటి చుట్టూ యాభై మందికి పైగా పోలీసుల్ని మోహరించారని ఆరోపించారు. ప్రజలకు నిజాలు తెలుస్తాయనే భయంతో తమను గోశాలకు వెళ్ళకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. అధికార పక్షం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసిందని, ఎస్పీతో అబద్ధాలు చెప్పించారని తీవ్ర విమర్శలు చేశారు.
ఎస్వీ గోశాలలో జరిగిన ఘటనను పూర్తి గా కామెడీ షోగా అభివర్ణిస్తూ, మేము వెళ్ళకూడదని అడుగడుగునా అడ్డుకోవడం ఎలాంటి రాజకీయం అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఫోన్ చేసి రావాలని చెప్పినపుడు తాను ఓకే చెప్పినా, తనకు సవాల్ విసిరిన పల్లా శ్రీనివాస్ వచ్చేందుకు ధైర్యం చేయలేదని ఎద్దేవా చేశారు.
తిరుమలలో గత పది నెలలుగా అరాచకాలు జరుగుతున్నాయని, డ్రైవర్ల మధ్య గొడవలు జరిగి, కొందరు హత్యకు కూడా పాల్పడ్డారని తెలిపారు. గోశాలలో వృషభం మృతి చెందిందని, తాను చూపిన ఫోటోలు అన్ని నిజమైనవేనని స్పష్టం చేశారు. చంద్రబాబు సహా ప్రతిపక్ష నేతలు అబద్ధపు ప్రచారం చేస్తుండగా, భక్తులు తిరుమలలో నిబంధనలు అతిక్రమిస్తున్నారని, గంజాయి, మద్యం, బిర్యానీ వంటి అనుచిత కార్యకలాపాలు సాగుతున్నాయని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
తిరుపతి గోశాల వివాదం ప్రజల్లో అసంతృప్తిని రగల్చడం సహజమని, కానీ.. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా మలిచారని వ్యాఖ్యానించారు. పోలీసులు తమపై ఉక్కు పాదంతో దాడి చేసి, స్వేచ్ఛ హరించారని బాధ వ్యక్తం చేశారు. దేవుడి అనుగ్రహంతో తాను మూడు సార్లు చైర్మన్ అయ్యానని గుర్తు చేస్తూ, టీటీడీ చరిత్రలో ఎవరు చేయని విధంగా సేవ చేసే అవకాశాన్ని పొందానని అన్నారు.
This article was really helpful and full of great information! The
website is well-organized and easy to navigate.