28.8 C
Hyderabad
Saturday, October 24, 2026

Live Video

spot_img

ఎన్నారై మరణంపై ఎలాన్‌మస్క్‌ సంచలన ట్వీట్‌

అమెరికాలో ఎన్నారై మరణంపై ఎలాన్‌మస్క్ సంచలన ట్వీట్‌ చేశారు. భారత సంతతి యువకుడు, 26యేళ్ల సుచిర్‌ బాలాజీ ఇటీవల అనుమానాస్పదంగా మృతిచెందాడు. సుచిర్‌ బాలాజీ గతంలో ఓపెన్‌ ఏఐలో పనిచేసి రాజీనామా చేశాడు. నవంబర్‌ 26వ తేదీన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా మారాడు.

అయితే, సుచిర్‌ మరణానికి కొద్దిరోజుల ముందే సంచలన ఆరోపణలు చేశాడు. చాట్‌ జీపీటీ మాతృసంస్థ అయిన ఓపెన్‌ ఏఐ సమాజానికి హాని కలిగిస్తోందని వ్యాఖ్యానించాడు. ఆ కామెంట్‌ చేసిన కొద్దిరోజులకే చనిపోయాడు. అయితే, సుచిర్‌ బాలాజీ మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఎలాన్‌మస్క్‌ స్పందించారు.

తన కుమారుడి మృతిపై సుచిర్‌ బాలాజీ తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తాము ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ ద్వారా తమ కుమారుడి మరణానికి సంబంధించి విచారణ చేయించామని, రెండోసారి పోస్టుమార్టం కూడా చేయించామని.. ఆ రిపోర్ట్‌.. పోలీసులు చెప్పిన దానికంటే డిఫరెంట్‌గా ఉందని ఆ పోస్టులో వెల్లడించారు. తమ కుమారుడి మరణంపై ఎఫ్‌బీఐ దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు. ఆ పోస్ట్‌ను ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్‌కు, భారత సంతతి నాయకుడు వివేక్‌ రామస్వామికి, భారత విదేశాంగశాఖకు ట్యాగ్‌ చేశారు బాలాజీ తల్లి.

అయితే ఎక్స్‌లో సుచిర్‌ బాలాజీ తల్లి చేసిన పోస్ట్‌పై ఎలాన్‌మస్క్‌ రియాక్ట్‌ అయ్యారు. సుచిర్‌ బాలాజీ మరణం ఆత్మహత్యలా అనిపించడం లేదని సందేహం వ్యక్తంచేశారు. దీంతో, సుచిర్‌ బాలాజీ తల్లి పూర్ణిమా రావ్‌ కూడా ప్రతిగా మరో పోస్ట్‌ చేశారు. దయచేసి తమకు మద్దతు ఇవ్వాలని ఎలాన్‌మస్క్‌కు ట్యాగ్‌ చేస్తూ మరో ట్వీట్‌ పోస్ట్‌ చేశారు.

ఎన్నారై సుచిర్‌ బాలాజీ నాలుగు సంవత్సరాల పాటు ఓపెన్‌ ఐఏ టీమ్‌లో ఉద్యోగం చేశాడు ఈ యేడాది ఆగస్టులో తన ఉద్యోగానికి రిజైన్‌ చేశాడు. తర్వాత న్యూయార్క్‌టైమ్స్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌ ఐఏలో కాపీరైట్‌ డేటాను వినియోగిస్తున్నారని ఆరోపించారు. చాట్‌జీపీటీ వంటి టెక్నాలజీ ఇంటర్నెట్‌ను దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించాడు. ఇలా వ్యాఖ్యానించిన నెలరోజులకే సుచిర్‌ బాలాజీ శవమయ్యాడు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com