అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కాస్త ఊరట.. కాస్త ఆందోళన కలిగించేలా న్యూయార్క్ కోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే హష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా తేలారు. అయితే న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్ ఎం.మెర్చన్ మాత్రం ఆయనను అన్ కండిషనల్ డిశ్చార్జ్ విధిస్తున్నట్లు తీర్పు ప్రకటించారు. దీంతో ఈ కేసులో ట్రంప్ దోషిగా నిర్ధారణ అయినా.. ఎలాంటి జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు.. ఎలాంటి జరిమానా విధించాల్సిన అవసరం లేదు.
అయితే ట్రంప్ మాత్రం ఓ రికార్డ్ క్రియేట్ చేశారు. అమెరికన్ పొలిటికల్ హిస్టరీలో గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని విధింగా క్రిమినల్ కేసులో దోషిగా తేలిన తర్వాత అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు. ఇది అమెరికా చరిత్రలో అధ్యక్ష చరిత్రలో తొలిసారి జరగబోతుంది.
ఇది మాత్రమే కాదు.. ట్రంప్ అన్‌కండిషనల్ డిశ్చార్జ్ కూడా ఓ వింతే అని చెప్పాలి. ఎందుకంటే క్రిమినల్ కేసులో దోషిగా తేలిన ఓ వ్యక్తికి ఎలాంటి శిక్ష లేకుండా శిక్ష విధించడం కూడా ఇదే తొలిసారి కావొచ్చు. ఎందుకంటే ట్రంప్ మొత్తం 34 అంశాల్లో దోషిగా తేలారు. అయినా కానీ ఆయనను అన్‌కండిషనల్‌గా డిశ్చార్జ్ చేశారు. అంతేకాదు ఈ తీర్పు వెలువరించే సమయంలో కూడా ఆయన కోర్టుకు రావాల్సిన అవసరం లేదని ముందే జడ్జి ప్రకటించడం కూడా మరో విడ్డూరం.
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్‌కు అనైతికంగా డబ్బు చెల్లించారనేది ప్రధాన ఆరోపణ. 2016లో బయట ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు 1,30,000 డాలర్లు ఇచ్చారు. ఈ నగదును లెక్కల్లో తప్పుగా చూపారు. దీంతో ఎన్నికల విరాళాలను దుర్వినియోగం చేసినట్టు కూడా నిరూపితమైంది.