24 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

డాక్టర్ నమ్రతపై తప్పుడు ప్రచారం

డాక్టర్ చిగురుపాటి నమ్రత డ్రగ్స్ కు బానిస అయ్యిందంటూ జరుగుతున్న ప్రచారంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం భరించలేని మనోవేదన(డిప్రెషన్) వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో డ్రగ్స్ తీసుకున్నట్లుగా వెల్లడించారు.

డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడిన డాక్టర్ నమ్రతను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే! ఒమేగా హాస్పిటల్ అధినేత కుమార్తె అయిన నమ్రత డ్రగ్స్ సేవిస్తుండటం, డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు పట్టుబడి అరెస్ట్ కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మీడియాలో రకరకాల కథనాలు కూడా వచ్చాయి. వైద్యురాలుగా ఉంటూ డ్రగ్స్ సేవించి వైద్యం అందించారా…? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

ఈ నేపథ్యంలో అసలు నమ్రత డ్రగ్స్ కు ఎలా అలవాటు అయ్యారు. అందుకు దారి తీసిన పరిస్థితులేంటి అనే విషయాలపై ఆరా తీయగా అనేక విషయాలు తెలిశాయి.

అసలు నమ్రతకు రెగ్యులర్ గా డ్రగ్స్ తీసుకునే అలవాటే లేదని తెలిసింది.

కుటుంబ సభ్యులు, ఆమె స్నేహితులు, హాస్పిటల్ నుండి సేకరించిన సమాచారం ప్రకారం…

ఏడాదిన్నర క్రితం నమ్రత దంపతుల మధ్య విబేధాలు ఏర్పడటం, కొన్ని నెలల తర్వాత ఇద్దరు విడిపోవడం జరిగింది..! ఇదే ఆమె మానసిక కుంగుబాటుకు కారణమైంది. స్పెయిన్ లో హాస్పిటల్ మేనేజ్మెంట్ విద్య పూర్తిచేసిన నమ్రత, అదే అర్హతతో ఒమేగా హాస్పిటల్ లో సీఈవో బాధ్యతలు చేపట్టారు. ఐతే భర్తతో ఏర్పడిన విబేధాలు.. గొడవల వల్ల చికాకులు ఎక్కువ కావడంతో మానసికంగా చాలా డిస్టర్బ్ అయిన ఆమె 2022 నుండి హాస్పిటల్ కు రావడం పూర్తిగా మానేశారు. ceo బాధ్యతల నుండి కూడా వైదొలిగారు.

భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత మరింత డిప్రెషన్ కు లోనయ్యారు. బంధువులు స్నేహితులను కూడా కలవడం మానేశారు. ఇంటిపట్టునే ఉండిపోయారు. ఈ క్రమంలో ఒంటరితనం ఆమెను మానసికంగా కృంగదీసింది..! తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల ఆమె ఆరోగ్యం ఏమైపోతుందో అన్న ఆందోళనకు కుటుంబ సభ్యులు గురయ్యారు. చాలా సందర్భాల్లో ఆహారం సరిగా తీసుకోకపోవడంతో స్పృహ తప్పడం వంటివి జరిగాయి. ఈ క్రమంలో ఆమె స్పెయిన్ లోని తన మెడికల్ కాలేజీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఒత్తిడి నుండి బయటపడటానికి ప్రయత్నాలు చేసారు. వాళ్ళు ఇచ్చిన సలహాతోనే ఇటీవల ఆమె డ్రగ్స్ తెప్పించుకున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఒకటీ రెండు సార్లు డ్రగ్స్ సేవించింది. మరోసారి డ్రగ్స్ కొనుగోలు చేసే ప్రయత్నంలో డ్రగ్స్ విక్రేత(peddler) పై పోలీసులు నిఘా పెట్టి ఉంచడం వల్ల… ఇద్దరూ పోలీసులకు చిక్కారు.

విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన నమ్రత

Radiation oncology కోర్సు తర్వాత స్పెయిన్ లోనీ ప్రతిష్టాత్మక Esade యూనివర్సిటీ లో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు కూడా నమ్రత పూర్తిచేశారు. ఒమేగా హాస్పిటల్ తన తండ్రి స్థాపించిన హాస్పిటల్ కాబట్టి ఆమె కుటుంబ సొంత ఆస్తిగా భావించవచ్చు..! కానీ ఆమె అలా వ్యవహరించలేదు. తాను చేసిన కోర్సు ప్రకారం ఉన్న అర్హత ఆధారంగా హాస్పిటల్ ceo బాధ్యతలు నిర్వహించారు. ఎప్పుడూ ఇతర వైద్య అంశాలలో తల దూర్చలేదు. ఔట్ పేషంట్,ఇన్ పేటెంట్స్ ను ఆమె నేరుగా ఎప్పుడూ కన్సల్టెంట్ గా చూడలేదు..ఇతర వైద్యులు అధికారులు సిబ్బంది విషయంలో కూడా గౌరవంగా వ్యవహరించేవారు. తాను ఒక సభ్యురాలిని అనే భావనతో వ్యవహరించేవారు. తన వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన ఒడిదుడుకుల వల్ల బాధ్యతలు సరిగా నిర్వహించలేకపోతున్నాననే కారణంతో బాధ్యతలనుండి తప్పుకున్నారు.

భరించలేని మనో వేదన వల్ల కోమాలోకి వెళ్ళిపోతానేమో అనే ఆందోళన నమ్రత వ్యక్తం చేసినట్లు తెలిసింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే డ్రగ్స్ సేవించానని.. తనకు డ్రగ్స్ తీసుకోవాలనే ఆలోచనలేదని కుటుంబసభ్యులకు చెప్పిన నమ్రత కన్నీటి పర్యంతమైంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com