ఆంధ్రప్రదేశ్ కు నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ (న్యాక్) వంటి సంస్ధ వచ్చేంత వరకూ మా రాష్ట్రానికి సపోర్ట్ చేయాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ న్యాక్ అధికారులను కోరారు. గురువారం మాదాపూర్ లో ఉన్న న్యాక్ కార్యాలయాన్ని ఎంపీ కేశినేని సందర్శించి అక్కడి పని తీరును పరిశీలించారు. ఆయనతో పాటు ఏపీ బిల్డింగ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఏపీ న్యాక్ అధికారులతో కలసి ఎంపీ శివనాథ్ న్యాక్ కార్యాలయాన్ని విజిట్ చేశారు. అమరావతిలో న్యా్‌క్ సంస్ధను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేసినట్లు ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు, నిరుద్యోగులకు, భవన నిర్మాణ కార్మికులకు న్యాక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఇస్తున్న శిక్షణా కార్యక్మ వివరాలను ఆయన అడిగి తెలసుకున్నారు. అమరావతి నిర్మాణానికి సివిల్ ఇంజనీర్లు, సివిల్ వర్కర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు చాలా మంది అవసరమవుతారని, సుమారు రూ.60,500 కోట్లతో రాజధాని అమరావతి పనులు ప్రారంభమయ్యాయని ఎంపీ వెల్లడించారు. న్యాక్ లో శిక్షణ పొందడం ద్వారా నైపుణ్యం సంపాదించిన వర్కర్లు ఉంటే అమరావతిలో అద్భుతమైన రాజధాని తయారు అవుతుందన్నారు. నిర్మాణాలు నాణ్యంగా కట్టాలంటే నిపుణలైన భవన నిర్మాణ కార్మికులు అవసరమని ఎంపీ కేశినేని అభిప్రాయప్డారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన న్యాక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దేశానికే గర్వకారణమన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ న్యాక్ విజిట్ లో ట్రైనింగ్ డైరెక్టర్ శాంతిశ్రీ, సీటీటీఐ ఎమ్.రాజరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ ఎన్.రాజు, ట్రైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎమ్.డి.అన్వర్ బిన్ మహమ్మద్, ఏపీ న్యాక్ రీజనల్ డైరెక్టర్ పి.మురళీధర్ తదితరులు ఉన్నారు.
- Advertisement with us -