ఇండియాలో భారత్‌పోల్ ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. ఇండియాలో నేరాలు చేసి విదేశాలకు పారిపోయే నేరస్థులను తీసుకొచ్చేందుకు ఈ పోర్టల్ ఉపయోగడనుంది. ఇది ఇంటర్‌పోల్‌కు లింక్ అయ్యి ఉంటుంది. దీంతో ఏ రాష్ట్ర పోలీస్ అయినా.. ఏ దర్యాప్తు సంస్థ అయినా భారత్ పోల్ ద్వారా నేరుగా ఇంటర్‌పోల్‌కు రిక్వెస్ట్ పెట్టుకొవచ్చు. దీనికి సంబంధించిన ట్రైనింగ్‌ను ఇచ్చే బాధ్యత సీబీఐ తీసుకోనుంది.
భారత్ పోల్ విశేషాలు..
- ఇకపై లెటర్లు, ఈమెయిల్స్, ఫ్యాక్సులు వంటి పాత తరహా కమ్యూనికేషన్ వ్యవస్థ స్థానాన్ని ఈ పోర్టల్ రీప్లేస్ చేస్తుంది.
- గతంకంటే మరింత మెరుగవనున్న సీబీఐ, ఇంటర్‌పోల్ మధ్య కమ్యూనికేషన్.
- ప్రపంచంలో జరిగే నేరాలు, వాటి అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడి దర్యాప్తు సంస్థలు విశ్లేషించవచ్చు. దర్యాప్తు సంస్థల మధ్య సమాచార మార్పిడి వేగంగా జరగనుంది.
- వివిధ కేసులకు సంబంధించి విదేశాల్లో ఉన్న నిందితులు, నేరగాళ్ల వివరాలను సులభంగా పంపవచ్చు.
- రెడ్ కార్నర్ నోటీసుల అంశంపై దర్యాప్తు సంస్థలు ఒకరికొకరు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవచ్చు.
- అంతర్జాతీయంగానే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ఈ పోర్టల్ అనేక సేవలను అందించనుంది.
- ఇతర రాష్ట్రాల పోలీసులు, దర్యాప్తు సంస్థలకు మధ్య వారధిగా ఉండనుంది ఈ పోర్టల్.
- విచారణకు సంబంధించి టెక్నికల్ టూల్స్, గైడెన్సును సైతం అందించనుంది.
- అంతర్జాతీయ స్థాయి కేసుల్లో అత్యంత కీలకం కానున్న భారత్ పోర్టల్
- సైబర్, ఆర్థిక నేరాలు, మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, ఆన్‌లైన్ రాడికలైజేషన్ నియంత్రించేందుకు ఉపయోగం.