23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

Live Video

spot_img

మన దేశంలో టెస్లా కార్ ధరెంతో తెలుసా?

  • ఇండియన్ మార్కెట్‌పై ఎలాన్ మస్క్ వ్యూహమేంటి?

  • మన ఈ-వెహికల్స్‌కి పోటీనే కాదంటున్న నిపుణులు

  • ప్రొడక్షన్‌ కాస్ట్ కూడా ఎక్కువే

  • దానికితోడు దిగుమతి సుంకాలు తగ్గింపు

  • అయినా బిజినెస్‌కు రెడీ అంటున్న మస్క్

బిలియనీర్ ఎలాన్ మస్క్ భారత్‌లోకి ఎంటర్ అవాలనుకుంటున్నారు. అదీ కార్ల బిజినెస్‌తో. సో.. టెస్లా కార్లు కూడా త్వరలోనే ఇండియన్ మార్కెట్‌లోకి ఎంటర్ కాబోతున్నాయి.

భారత్‌ దిగుమతి సుంకాలు 20 శాతం తగ్గించేసినా మస్క్ భారత మార్కెట్‌లో కార్ల తయారీ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించారు. గ్లోబల్‌ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ లెక్కల ప్రకారం టెస్లా కారు ఖరీదు రూ.35 లక్షల నుంచి రూ.45లక్షల వరకూ ఉంటుందని తెలుస్తోంది. టెస్లా కంపెనీ చెబుతున్న దాని ప్రకారం అత్యంత చవకైన మోడల్‌ 3 టెస్లా కారు అమెరికాలో ఫ్యాక్టరీ అవుట్ లెట్‌ నుంచి నేరుగా ఖరీదు చేస్తే సుమారు రూ.34 లక్షల రూపాయలు పలుకుతోంది. మన దేశంలో 25నుంచి 30 శాతం తగ్గిన దిగుమతి సుంకం, అదనపు ఖర్చులయిన రోడ్ టాక్స్, ఇన్సూరెన్సు, రిజిస్ట్రేషన్ తదితర అన్ని ఖర్చులతో కలుపుకుంటే ఆన్‌రోడ్ ప్రైస్ ఇంచుమించుగా రూ.35 నుంచి 40 లక్షల వరకూ ఉంటుంది.

ఈ-వెహికల్ తయారీ రంగంపై నో ఎఫెక్ట్‌ :

మన దేశంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఈ-వెహికల్స్ అయిన మహింద్రా XEV 9e, హుండయ్ ఈ -క్రెటా, మారుతి సుజుకి ఈ-విటారా ధరలను పరిశీలిస్తే టెస్లా భారత్ లోకి అడుగు పెట్టినా మన ఈ-వెహికల్‌ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపబోదని వాణిజ్య నిపుణులు అంటున్నారు. టెస్లా కంపెనీ ఆన్ రోడ్ కార్‌ను రూ.25 లక్షలకు గనక మార్కెట్‌లోకి దింపితే మాత్రం మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి కంపెనీలపై ఆ ప్రభావం పడుతుందని అంటున్నారు. అమెరికా, చైనా, యూరప్ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ-వాహనాల వాడకం చాలా తక్కువ కాబట్టి భారతీయ ఆటో మేకింగ్ రంగంపై టెస్లా ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. టెస్లా కంపెనీ తన కార్లను రానున్న రోజుల్లో ఢిల్లీ మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఉద్యోగుల రిక్రూట్‌ మెంట్‌, కంపెనీ ఏర్పాటుకు స్థల పరిశీలన లాంటి పనులు టెస్లా కంపెనీ పూర్తి చేసుకుంది.

ఈనెల 18వ తేదీనే ముంబై మెట్రోపాలిటన్ నగరంలో కన్స్యూమర్ ఎంగేజ్‌మెంట్‌ మేనేజర్ పోస్టులను లింక్డిన్ మీడియాలో ఎనౌన్స్ చేసింది. దిగుమతి సుంకాలు 20 శాతం తగ్గినా తాము భారత్‌లో టెస్లా కార్ల తయారీ కంపెనీని పెట్టాలని, ఆపరేషన్స్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆ ఉద్యోగ ప్రకటనలో టెస్లా పేర్కొంది. మనదేశంలో తాము పెట్టబోయే రూ.4,150 కోట్ల బిలియన్ల పెట్టుబడితో ఏడాదికి 8వేల యూనిట్ల వరకూ 15 శాతం దిగుమతి సుంకాన్ని భరించినా తమకు నష్టం ఉండబోదని కంపెనీ తేల్చింది.

ఈసంద్భంగా బ్రాండెడ్‌, హై ఎండ్‌ మోటార్ సైకిళ్ల అమ్మకాల రేట్లను కూడా ఆకంపెనీ అధ్యయనం చేసింది. రాయల్‌ ఎన్‌ ఫీల్డ్ క్లాసిక్ 350తో పోలిస్తే హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440 ధర 20 శాత అధికమని.. అందుకే రాయల్‌ ఎన్‌ ఫీల్డ్ మోటార్ సైకిళ్ల కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నాయని ఆ కంపెనీ తేల్చింది. నెలకు 1500 హార్లే డేవిడ్సన్ యూనిట్స్‌ అమ్ముడవుతుంటే రాయల్‌ ఎన్‌ ఫీల్డ్ నెలకు 28,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయని తేలింది. దీనర్ధం భారతీయులు ధరలు ఎక్కువగా ఉన్న ఉత్పత్తులపై పెద్దగా ఆసక్తి చూపించరని తేలుతోంది. దీనిని బట్టి టెస్లా కంపెనీ భారతీయులకు అనువైన ధరల్లో ఉత్పత్తులను అందిస్తేనే సక్సెస్ అవుతుంది. ఈ సవాల్‌ను ఆ సంస్థ ఎలా అధిగమిస్తుందో చూడాలి. టెస్లా కార్ల తయారీ మన దేశంలో మొదలైతే స్థానిక తయారీ రంగంపై దాని ప్రభావం ఎలా ఉండబోతోందన్నది ఉత్కంఠగా మారింది. ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గిన నేపథ్యంలో మన దేశంలో టెస్లా కార్లపై మధ్యతరగతి జనం ఆసక్తి చూపించకపోవచ్చు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com