దేశ వ్యాప్తంగా యూజీసీ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో ఎందరో పేద విద్యార్థులు , మహిళలు, గృహిణిలు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు,ఉద్యోగస్తులు దూరవిద్యకు బహుదూరమవుతున్నారు. ఇటీవల యు.జి.సి తీసుకువచ్చిన నిబంధన గుడిబండగా మారింది. ఆ యూనివర్సిటీ పరిధిలో మాత్రమే విద్యార్థులు చదువుకోవాలని నిబంధనలు తీసుకురావడంతో, రాష్ట్రంలోని యూనివర్సిటీ వాటి పరిధిలో విద్యను అందించడం వల్ల చాలామంది విద్యార్థులు, మహిళలు, ఉద్యోగస్తులు, గృహిణులు, ముఖ్యంగా వికలాంగులు విద్యకు దూరమవుతున్నారని మేధావులు అంటున్నారు. ఒక విద్యార్థి చదువుకోవాలంటే కేవలం ఆ యూనివర్సిటీ పరిధిలోనే చదువుకోవాలి లేదా ఇతర యూనివర్సిటీలో చదువుకోవాలంటే 100 నుండి 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది చదువుకు దూరమై ఇంటి దగ్గరే ఉంటున్నారు.
దూర విద్యకు యూనివర్సిటీ పరిధి.
దూర విద్య అంటేనే ఇంటి దగ్గర కూర్చొని గృహిణిలు, మహిళలు, పేద విద్యార్థులు, ప్రమోషన్ల కొరకు ఉద్యోగస్తులు తమ సమీపంలో ఉన్న యూనివర్సిటీలో చదువుకోవాలని అనుకుంటారు. కానీ యూజీసీ తీసుకొచ్చిన నిబంధనలతో వీరందరికీ ఇబ్బంది ఏర్పడిందని విద్యార్థులు, మహిళలు గృహిణిలు ఉద్యోగస్తులు విద్యకు దూరమవుతున్నట్టు చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాలలో దూరవిద్య లేని కారణంగా 100 నుండి 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి క్లాసులో కానీ, పరీక్ష సమయంలో వెళ్లి రాయాలంటే ఆర్థిక ఇబ్బందితో పాటు, వ్యయ భారం పడుతుంది. కొన్ని సందర్భాలలో పరీక్షలు రాసి వచ్చే సమయంలో
విద్యార్థులు ఆక్సిడెంట్లు ఐన సంఘటనలు ఎన్నో ఉన్నాయని విద్యార్థులు అంటున్నారు. యూనివర్సిటీ అధికారులను సంబంధిత విషయంపై రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకులు మా జిల్లాలో దూర విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యను అందించండి అంటే మీ జిల్లా మా యూనివర్సిటీ పరిధిలో లేదంటూ విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారు. యూజీసీ అనుమతిస్తే యూనివర్సిటీ అధికారులు సమాధానం ఇస్తున్నారు.
అసలు దూరవిద్య అంటే ఏంటి.
దూరవిద్య ఒక చక్కటి వరము లాంటిది విద్యార్థులకు మహిళలు, ఉద్యోగస్తులు, గృహిణిలు, పేద విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులు ఇంటి దగ్గర ఉండి విద్యను అభ్యసించేవారు. యూనివర్సిటీలు వివిధ ప్రాంతాలలో దూరవిద్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దూరవిద్య కేంద్రాల ద్వారా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతము యూజీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో పేద విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులు, ఉద్యోగస్తులు, ముఖ్యంగా వికలాంగులు, గృహిణిలు విద్యకు దూరమవుతున్నారు. ఉద్యోగస్తులు ఉన్నచోటనే ఉద్యోగం చేసుకుంటూ దగ్గర్లో ఉన్న కేంద్రాల్లో చదువుకుంటూ ప్రమోషన్ల కొరకు పరీక్షలు రాస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వీరందరికీ దూరవిద్య బహుదూరం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము యూజీసీతో చర్చలు, సంప్రదింపులు జరిపి, యూజీసీ తీసుకువచ్చిన యూనివర్సిటీ పరిధి తొలగించి, దూరవిద్య కేంద్రాలను తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.
కొన్ని యూనివర్సిటీలు దూరవిద్య కు దూరం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలలో పూర్వము కాకతీయ యూనివర్సిటీ అనుబంధమైన దూర విద్యా ( ఎస్ డి ఎల్ సి ఈ ) కేంద్రం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలంతా విద్య అభ్యసించేవారు. ప్రస్తుతం దూరవిద్యలో చదవాలంటే 100 నుండి150 కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొందరు విద్యార్థులకు, ఆర్థిక, దూరభారంతో , చదువును మధ్యలో ఆపేసి కూలి పనికి వెళ్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దూరవిద్య కేంద్రాలను రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని విద్యార్థులు మేధావులు కోరుకుంటున్నారు.