22.7 C
Hyderabad
Friday, November 27, 2026

Live Video

spot_img

తెలంగాణ రాష్ట్ర గణాంకాల ఆవిష్కరణ

రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రూపొందించిన Telangana State Statistical Abstract(Atlas) పుస్తకాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ రోజు(సోమవారం) అవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర గణాంకాలు రాబోయే రాష్ట్ర బడ్జెట్ లో పద్దుల కేటాయింపునకు ఉపయుక్తంగా ఉంటాయని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్, ప్లానింగ్ డైరెక్టర్ షేక్ మీరా తదితరులు ఉన్నారు.

తెలంగాణ గణాంకాల్లో అనేకమైన ఆసక్తికరమైన ఆంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. దేశంలో పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. పశు సంపద, మత్స్య సంపద గణనీయంగా పెరిగింది.

తాజా గణాంకాల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్ లో పద్దుల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటుంది. దీంతో వెనుకబడిన వర్గాలు, రంగాలకు కేటాయింపులు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com