26.7 C
Hyderabad
Wednesday, April 29, 2026

Live Video

spot_img

సిరాజ్, హెడ్‌లపై ఐసీసీ సీరియస్

అసలే ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్.. ఆపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ. మాములుగానే మాటల యుద్ధం నడుస్తుంటోంది. కానీ అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో మాత్రం ఈ డోస్ పెరిగింది. అదే ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్‌కు కాస్త చిక్కులు తెచ్చి పెట్టింది. మ్యాచ్ సెకండ్ డే టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్, ఆసీస్ బ్యాటర్ హెడ్ మధ్య డైలాగ్ వార్ జరిగింది. ట్రావిస్ హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్ అదే ఊపులో రెండు డైలాగ్స్ వదిలాడు. బయటకు వెళ్లిపో అన్నట్టుగా చేతులతో సైగలు చేశాడు. హెడ్ కూడా తిరిగి స్పందించాడు. అయితే అక్కడ ఎగ్జాక్ట్‌గా ఏం జరిగిందన్నది మాత్రం ఇద్దరు చెప్పలేదు. కానీ ఈ వ్యవహారంపై ఐసీసీ మాత్రం సీరియస్ అయ్యింది. ఇప్పుడు ఇద్దరికి ఫైన్ పడేలా కనిపిస్తున్నాయి ప్రస్తుత సిట్యూవేషన్స్ చూస్తుంటే.

ఈ వ్యవహారంలో అటు సిరాజ్, ఇటు హెడ్.. ఇద్దరిదీ తప్పు ఉందని ఐసీసీ తేల్చినట్టు కనిపిస్తోంది. సంతోషకరమైన విషయం ఏంటంటే ఎవరిని సస్పెండ్ చేయడం, మ్యాచ్‌లపై నిషేధం విధించడం లాంటివి చేయకుండా జస్ట్ ఫైన్‌తో వారిని శిక్షించాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. నిజానికి స్టన్నింగ్ డెలివరీతో హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు సిరాజ్. దీని గురించి ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్‌లతో పాటు ఇరు జట్లు కెప్టెన్లు రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్ కూడా స్పందించారు. తాను బాగా బౌలింగ్ చేశావని మెచ్చుకున్నానని, కానీ సిరాజ్ మాత్రం అపార్థం చేసుకున్నాడని హెడ్ చెప్పాడు. అసలు హెడ్ ఆ మాటలే అనలేదంటూ సిరాజ్ చెప్పాడు. కానీ ఎగ్జాక్ట్‌గా వారు మాట్లాడిన మాటలేంటన్నది మాత్రం చెప్పలేదు. కానీ ఇరు జట్ల సారధులు మాత్రం తమ ప్లేయర్స్‌కు అండగా ఉంటామని ప్రకటించారు.

ఇప్పటికైతే ఇరు టీమ్స్‌ ఈ సిరీస్‌లో 1-1తో సమానంగా ఉన్నారు. నెక్ట్స్ జరిగే మూడో టెస్ట్ గబ్బాలో జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి. ఇప్పటికే టెస్ట్ చాంపియన్ షిప్‌లో మూడో స్థానానికి పడిపోయింది టీమ్ ఇండియా. పరిస్థితి ఇలానే ఉంటే టెస్ట్ చాంపియన్ షిప్ ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com