తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం నూతన సంవత్సర 2025 డైరీ, క్యాలెండర్ని బుధవారం ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నెహ్రూ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ తోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్తు ఇంజనీర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.
1999- 2004 మధ్యకాలంలో నియమాకమైన ఇంజనీర్లు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జిపిఎఫ్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కేటీపీఎస్ పాల్వంచలో 8 మెగావాట్ల ధర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మించాలని, రామగుండంలో genco ఆధ్వర్యంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బాలరాజు, మోహన్ రావు, డి. శ్రీనివాస్, పాండ్యా, మధు కృష్ణ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.