ప్రజా ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మధిర నియోజకవర్గం బోనకల్ లోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలకు చేరుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి ఘనంగా స్వాగతం పలికిన జిల్లా అధికారులు, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది. గురుకుల పాఠశాల విద్యార్థులు.
కామన్ డైట్ మెనూ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులతో ఇంట్రాక్షన్ అయిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో గర్వపడేలా గురుకులాలను ప్రజా ప్రభుత్వం బలోపేతం చేస్తుందని భట్టి అన్నారు.