మోహన్ బాబు కుటుంబంలో కలహాలు ఠాణా వరకు చేరగా… పెద్దరాయుడిని అరెస్టు చేయనున్నారనే వార్తలు గందరగోళం సృష్టిస్తున్నాయి. హైకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరించారని నిన్న వార్తలు వచ్చాయి. మోహన్ బాబు గన్ సరెండర్ చేస్తానంటే పోలీసులు జలపల్లి నివాసానికిి వెళ్లగా ఆయన లేరని కుటుంబ సభ్యులు తెలిపారు.
అదే సమయంలో మోహన్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారని ప్రచారం జరిగింది. పోలీసులు గాలించటం లేదని శంషాబాద్ డిసిపి వెల్లడించారు. దీనిపై స్పందించిన మోహన్ బాబు ఎక్స్ వేదికగా స్పందించారు.
తప్పుడు ప్రచారం చేస్తున్నారు.! ముందస్తు బెయిల్ తిరస్కరించబడలేదు మరియు ప్రస్తుతం. నేను మా ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలను బయటపెట్టాలని మీడియాను కోరుతున్నానని మోహన్ బాబు వివరణ ఇచ్చారు.
అయితే మీడియాలో మాత్రం ఐదు పోలీసు బృందాలు గాలిస్తున్నాయని వార్తలు ప్రసారం అవుతున్నాయి.