24.1 C
Hyderabad
Monday, November 2, 2026

Live Video

spot_img

సిఎస్ పై వేటు…!

  • తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీరుపై ప్రభుత్వ పెద్దల సంతృప్తి
  • శాంతి కుమారి కోఆర్డినేషన్ చేయలేకపోతున్నారని విమర్శలు
  • సీఎస్ తీరుపై సీఎంకు సీనియర్ ఐఏఎస్ ల ఫిర్యాదులు
  • సంక్షేమ పథకాల అమలు విషయంలో నిర్లక్ష్యం
  • సీఎం రేవంత్ రెడ్డి త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలిసింది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా పాలనాపరమైన వ్యవహారాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కొందరు కలెక్టర్లు పనిచేయకపోవడం  సీనియర్ ఐఏఎస్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం… ఐపీఎస్‌లు వివాదాలు సృష్టించడం. మంత్రులకు అధికారులకు మధ్య గ్యాప్ రావడం ఇలాంటివన్నీ జరగడంపై ముఖ్యమంత్రి పూర్తి స్ధాయి నివేదిక తెప్పించుకున్నట్టుగా తెలిసింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని ప్రభుత్వం చెప్పిన పనులు కూడా చేయడం లేదని బహిరంగంగానే కామెంట్లు చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కార్యక్రమాలలో సైతం అధికారులు యాక్టివ్గా పాల్గొనడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి.

నిజానికి పాలనాపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాత్ర అత్యంత కీలకమైంది. ముఖ్యమంత్రి ఆలోచనలకు పరిపాలన విధానాలకు అద్దం పట్టేలా సిఎస్ వ్యవహరించాలి.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డైరెక్షన్లో జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ కార్యదర్శులు పనిచేస్తారు. ఒక రకంగా మొత్తం ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత సిఎస్ దే. ప్రస్తుత సిఎస్ శాంతికుమారి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే సిఎస్ గా నియమించబడ్డారు. జనరల్ గా ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా మారతారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం శాంతి కుమారిని ప్రధాన కార్యదర్శిగా కొనసాగించారు. అయితే ఈ ఏడాది కాలంలో జరిగిన పరిణామాలను ఆమె అంత యాక్టివ్ గా లేనట్టుగా ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. కోఆర్డినేషన్ లేకపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా చెబుతున్నాయి. గురుకుల పాఠశాలలో కొత్త మెనూ పెట్టి మంచి భోజనం అందించే కార్యక్రమాన్ని చేపట్టినా దానికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడానికి అధికారులు వ్యవహరించిన తీరే కారణమని సీఎం కార్యాలయానికి నివేదికలు వచ్చాయి. ముఖ్యమంత్రి కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ శాఖలకు సంబంధించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా కొందరు ఈ విషయంపై సీఎస్ వ్యవహరిస్తున్న తీరును ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలిసింది. తాజాగా నాలుగు సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం అంతకుముందు జరిగిన గ్రామసభల్లో కూడా కొంత గందరగోళం నెలకొనడానికి అధికారుల మధ్య సఖ్యత లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎంఓ దృష్టికి తీసుకు వచ్చాయి. తాజా పరిణామాల నేపద్యంలో ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారుని తొలగించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తున్నట్లుగా తెలుస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com