32.3 C
Hyderabad
Tuesday, August 11, 2026

Live Video

spot_img

క్రికెటర్ రింకు సింగ్ కాబోయే భార్య ఎంపీ ప్రియా సరోజ్

క్రికెటర్ రింకు సింగ్ ఓ ఇంటి వాడయ్యాడు. రింకు కాబోయే భార్య పార్లమెంటు సభ్యురాలు ప్రియా సరోజ్. త్వరలో వివాహం చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో  ప్రచారం జరుగుతోంది. అయితే, స్టార్ క్రికెటర్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఎటువంటి ధృవీకరణ లేదు. రెండు కుటుంబాల నుంచి అధికారికంగా ఎవరు ప్రకటించలేదు. ఉత్తరప్రదేశ్ లోని మచిలీషహర్ పార్లమెంటు సభ్యురాలు ప్రియా సరోజ్. సమాజ్ వాది పార్టీ తరపున 2024లో ప్రియా సరోజ్ ఎన్నికైంది.

ఇక క్రికెటర్ రింకు సింగ్ విషయానికి వస్తే… ఆయన పూర్తి పేరు రింకు ఖాన్ చాంద్ సింగ్. రింకు ఉత్తరప్రదేశ్ లోని ఆలీఘడ్ కు చెందినవాడు. ఐపీఎల్ కారణంగా టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్‌ లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు కొట్టి వెలుగులోకి వచ్చిన రింకూ సింగ్‌ ధర.. ఒక్క సీజన్ వ్యవధిలోనే రూ.55 లక్షల నుంచి రూ.13 కోట్లకి పెరిగింది. ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్ ఇతడిని రూ.13 కోట్లకు రిటైన్ చేసుకుంది.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com