25.6 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

తెలంగాణలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల శాసనమండలి స్థానలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి సోమవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. గత ఫిబ్రవరి నెల 27వ తేదీన కంరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలకు సంబంధించి ఒక ఉపధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. అలాగే వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించి ఒక ఉపాధ్యా ఎమ్మెల్సీ స్థానాకి ఎన్నికలు జరిగాయి. ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యింది. ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజు సాయంత్రం ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అయితే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 3.55 లక్షల ఓట్లు ఉండటంతో ఫలితాలు వెలువడటానికి రెండు రోజులు పట్టొచ్చని అధికారులు చెపుతున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల పట్టభ్రుదల, ఉపాధ్యయ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కరీంనగర్‌ నగరంలో ఉన్న అంబేద్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతోంది. ఈ స్థానాల్లో ఉపాధ్యయ ఎమ్మెల్సీ స్థానం కోసం 15 మంది పోటీ పడుతుండగా, పట్టభద్రుల స్ధానం కోసం అత్యధికంగా 56 మంది పోటో పడుతున్నారు. ఇక వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు నల్గొండ పట్టణంలో ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ గోదాముల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ స్థానం నుంచి 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com