ఆంధ్రప్రదేశ్‌లో గత నెల 27వ తేదీన జరిగిన మూడు ఎమ్మెల్సీ స్ధానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యింది. ముందుగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల, ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాల, గుంటూరు ఏసీ కళాశాలల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలోని మూడు ఎమ్మెల్సీ స్ధానాలకు కాను మొత్తం 70 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ నియోజకవర్గం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ మూడు స్థానాలకు కూడా పోటీ దారులు అధికంగా ఉండటంతో ప్రాధాన్యత ఓట్ల ఆదారంగా విజేతను ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో ఈ స్థానాల తుది ఫలితాలు వెలువడటానికి చాలా సయం పట్టడానికి ఆస్కారం ఉంది. తొలి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలితే సాయంత్రం 5 గంటల వరకూ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అలా కాకుండా పోటీ అధికంగా ఉంటే ప్రాధాన్యతా ఓట్లు లెక్కింపు అనివార్యమవుతుందని అధికారులు చెపుతున్నారు. కౌటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
- Advertisement with us -