25.7 C
Hyderabad
Saturday, October 31, 2026

Live Video

spot_img

లారీ డ్రైవర్‌ని చితకబాదిన పోలీసులు

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పేరుతో వీఎంబంజర పోలీసుల దారుణం

ఓ లారీ డ్రైవర్‌ను డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో అరెస్ట్‌ చేసి చితకబాదిన సంఘటన ఖమ్మం జిల్లా వీఎం బంజర పోలీస్‌ స్టేషన్లో జరిగింది. కోదడ ప్రాంతానికి చెందిన జీవన్‌ కుమార్ అనే వ్యక్తి పదేళ్ళుగా లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఖమ్మం జిల్లా వీఎం బజర పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో లారీ నడుపుకుంటూ వస్తున్న జీవన్‌ కుమార్‌ని పరీక్షించారు. జీవన్‌ మద్యం సేవించి మందు నడుపుతున్నాడని పోలీస్‌ స్టేషన్‌కి తీసుకువెళ్ళి దారుణంగా కొట్టినట్లు బాధితుడు చెపుతున్నాడు. అయితే జీవన్‌ కుమార్‌ మందు తాగకపోయినా పోలీస్‌ స్టేషన్‌కి తీసుకు వెళ్లి తీవ్రంగా కొట్టారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జీవన్‌ని పోలీసులు తవ్రంగా కొట్టడంతో దెబ్బలు తాళలేక పారిపోయే ప్రయత్నం చేస్తూ పోలీస్‌ స్టేషణ్‌ మొదటి అంతస్తుకు పరుగు తీయగా పోలీసులు అక్కడికి కూడా వెళ్ళి జీవన్‌ కుమార్‌ని చితక్కొట్టి పై నుంచి కిందకు తోసేసారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుడు జీవన్‌ కుమార్‌ కూడా ఇదే వెర్షన్‌ చెపుతున్నాడు. దెబ్బలతో ఉన్న జీవన్‌ని ఇద్దరు కానిస్టేబుళ్ళు తీసుకువచ్చి ప్రభుత్వాసుపత్రిలో వదిలి పోయారని మేము వచ్చి చూస్తే ఎముకలు, నడుము విరిగిపోయి ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యం సరిగా లేకపోవడంతో జీవన్‌ కుమార్‌ని మేమే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించుకుంటున్నామని జీవన్‌ మేనమామ తెలిపారు. లారీ ఓనర్‌ అడిగితే పోలీస్‌ స్టేషన్‌ పై నుంచి పడ్డాడని చెపుతున్నాడని,  పోలీసులు ఏమో లారీపై నుంచి దూకాడని చెపుతున్నారని బాధితుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు మాకు న్యాయం చేయాలని జీవన్‌ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com