తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఘాటుగా స్పందించారు. విద్యార్థులకు నాసిరకం బోజనం పెడుతున్నారని ఆరోపించారు.
ఎక్స్ వేదికగా కెటిఆర్ విమర్శనాస్త్రాలు
ఇది కక్ష్యా ?
ఇది శిక్ష్యా?
ఇది నిర్లక్ష్యమా ?
పదేళ్లలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాల గౌరవం.. ఏడాదిలో ఎందుకు పడిపోయింది ?
గురుకులాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టే ప్రయత్నం చేస్తున్నారా ?
మండలానికి ఒక్క గురుకుల పాఠశాలకు మాత్రమే పరిమితం చేసే కుట్ర దాగి ఉందా ?
అందుకే ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రులలో అభద్రతా భావం పెంచుతున్నారా ?
ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?
ప్రతిష్ఠాత్మకంగా సీఎం నుండి మంత్రుల వరకు కామన్ డైట్ అంటూ అట్టహాసంగా ప్రారంభించింది ఆరంభ శూరత్వమేనా ?
కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శం
నేడు అంతులేని నిర్లక్ష్యం
విద్యార్థులు గురుకులాల నుండి పారిపోయే పరిస్థితికి కారణమెవ్వరు ?
https://x.com/KTRBRS/status/1873554932709908622?t=5Ku5eg38GQFMOKzbmlYMeg&s=08
ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని కెటిఆర్ విమర్శించారు. కామన్ డైట్ పేరుతో సీఎం, మంత్రులు చేసిన ప్రకటనలకు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేదని కెటిఆర్ మండిపడ్డారు.